మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” చెప్పిన 8 జీవిత సత్యాలు..!

మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” చెప్పిన 8 జీవిత సత్యాలు..!

by Mounika Singaluri

Ads

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక రచయితగా అందరికీ పరిచయమే. అందరూ త్రివిక్రమ్ మీద గౌరవంతో ఆయనను గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు. నిజంగా ఆయన ఏ ఒక్కరికో గురువు కాదు ఆయన మాటలు విని పాటించే ప్రతి ఒక్కరికి ఆయన గురువే…త్రివిక్రమ్ కలానికి ఉన్న బలం, మాటల పదును ఆయనను ఈరోజు అంత ఎత్తులో నిలబెట్టాయి.

Video Advertisement

త్రివిక్రమ్ సినిమాలో డైలాగులు ఎలాగో అలరిస్తాయి. అది కాకుండా ఆయన బయట ఫంక్షన్లలో చెప్పే మాటలు జీవిత సత్యాలు అనిపిస్తాయి.

అరె త్రివిక్రమ్ చెప్పింది నిజమే కదా అని అనిపించక మానదు. ఎప్పుడైనా జీవితంలో బాధగా అనిపిస్తే త్రివిక్రమ్ మాటలు వింటే చాలు, ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకుంటుంది. ఇలా త్రివిక్రమ్ చెప్పిన ఎన్నో మాటల్లో కొన్ని మీ కోసం.ఎందుకంటే ఈరోజు గురూజీ పుట్టినరోజు కాబట్టి…

1.

tollywood directors and their sentiments..!!
కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు, కొన్ని అనుభూతులను ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు…

2.

ఐదేళ్ల వయసులో ఉన్న పిల్లోడు తన తండ్రిని సూపర్ హీరో అనుకుంటాడు. పదేళ్లు వయసు వచ్చాక వేరే వాళ్ళ తండ్రిని చూశాక మా నాన్న అంత గొప్పోడు ఏం కాదులే అంటాడు. 18 ఏళ్లు దాటాక సిగరెట్ తాగొద్దు ఇంటికి త్వరగా రా అంటే నాన్నేంటి నస పెడుతున్నాడు అనుకుంటాడు. పాతిక సంవత్సరాలు వచ్చి పెళ్లి చేసుకుని ఇంటి అద్దె, ఖర్చులు కోసం నెలాఖరులో అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు నాన్న మనం అనుకున్నంత వేస్ట్ కాదు అనుకుంటాడు. 30 ఏళ్లు దాటాక పిల్లలు స్కూల్ ఫీజులు, రాత్రి జ్వరం వస్తే హాస్పిటల్ కి పరిగెత్తి, డబ్బులు లేనప్పుడు నాన్న గుర్తొచ్చి కంట్లో నీళ్లు వస్తాయి. అది మనం చెబుదాం అనుకున్న రోజు నాన్న ఉండడు చనిపోతాడు.

3.


మనం సరిగ్గా ఊపిరి పిలిస్తే 98% జబ్బులు రావు.గాలి ఫ్రీగా దొరుకుతుంది కానీ అది పిల్చం. దానికి బదులు సిగరెట్ కొనుక్కుని కాల్చి చనిపోవడానికి రెడీ అవుతాం. అలాగే మంచినీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం కానీ పది రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము. 60 రూపాయలు పెట్టి బీర్ కొనుక్కుని తాగి పాడైపోతుంటాం.

4.

మనిషి గొప్పోడు అందరికంటే. అతని కలలు గానీ, అతని ఆశయాలు గాని,అతని అలవాట్లు గాని జీవితంలో అతడిని ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి అనేది డిసైడ్ చేస్తాయి. అతని ఆశయం గొప్పది అయితే పైకి ఎదుగుతాడు. అతని అలవాట్లు ఆశలు చెడ్డవి అయితే కిందకి పడిపోతాడు.

5.

రూపాయలేకపోతే మన ఆనందాలైనా, అయిన వాళ్ళయినా దూరమవుతారు… సిగరెట్ తాగి పాడైపోవడం కంటే, అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం కంటే ఒక మూడు గంటలు సినిమా చూడడం మంచిది.

6.

మనిషి మాట్లాడుకోవడం మానేశాడు. ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం. మొబైల్ చూస్తూ పక్క వారికి హాయ్ చెప్తున్నాం. ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా సీరియల్ పెట్టుకుని భోంచేస్తున్నాం. లేదంటే నైట్ 10 ,11 దాకా ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటాం. ప్రపంచం బాగుండాలంటే మనిషి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుని మాట్లాడుకుంటే చాలు.

7.

directors who succed on their first movie..!!
సిగరెట్ అలవాటున్న రోజుల్లో అది కాలుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఒక టీ కి  సరిపోనీ డబ్బులు ఉంటే వన్ బై టు తాగి, ఏం అవ్వాలి అని ఆలోచించిన క్షణాలు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటే తియ్యగా అనిపిస్తాయి.

8.

కలలు కనండి. చాలా పెద్ద పెద్ద కలలు కనండి. వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించండి. మన కలలు ఎప్పుడూ కూడా మనం ఊహించిన దాని కంటే ఎక్కువ పెద్దగా ఉండాలి.

 

Also Read:తెలుగు ఇండస్ట్రీ మొదటి హీరో “కళ్యాణం రఘురామయ్య” కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..?


End of Article

You may also like