కారులో ఆ పని చేసి ప్యాంటు మరిచిపోయావా అంటూ ట్రోల్…రకుల్ స్ట్రాంగ్ కౌంటర్..!!

కారులో ఆ పని చేసి ప్యాంటు మరిచిపోయావా అంటూ ట్రోల్…రకుల్ స్ట్రాంగ్ కౌంటర్..!!

by Anudeep

Ads

కెరటం మూవీతో తెలుగులో అడుగుపెట్టినప్పటికి  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో రకుల్ కి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఒకేసారి టాప్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది. ఎన్టీయార్, నాగచైతన్య, అల్లు అర్జున్,మహేశ్ బాబు,రాం చరణ్ ఇలా స్టార్ హీరోలందరితో  సరసన నటించే ఛాన్స్ కొట్టేసినప్పటికి  ప్రస్తుతం డిజాస్టర్ స్టార్ గా మిగిలిపోయింది. గత కొంత కాలం గా అమ్మడి టైం బాగోలేనట్టుంది. సినిమా ఛాన్సులొస్తున్నప్పటికి రావాల్సినంత పేరు మాత్రం రావట్లేదు. మరోవైపు ఏదో ఒక వ్యవహారంలో చిక్కుకుని ట్రోలర్స్ కి దొరికిపోతోంది.

Video Advertisement

ఇప్పడేమైంది అనుకుంటున్నారా? ఇప్పుడేంటి మన్మధుడు మూవీ అప్పటినుండి రకుల్ కి ఏదో అయింది. ఆ సినిమా టైంలో రకుల్ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు. మన్మదుడు నాగార్జునతో ఛాన్స్, సినిమా కూడా మన్మధుడు అంత సక్సెస్ అవుతుందని కలలు కన్నది . కాని ఆ సినిమా బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడి డీ గ్రేడ్ మూవీగా పేరు మూటగట్టుకుంది. రకుల్ ఆశల్ని అడియాశలు చేసింది.

 

మన్మధుడు తర్వాత స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎన్నో ఫీట్లు చేసింది. అమ్మడు   ఎన్ని పాట్లు పడ్డా ప్రేక్షకులు మాత్రం గుర్తించలేదు. ప్రార్ధన ప్రతి పైసా కౌంట్ ఇక్కడ అంటూ తన చూపులతో ఆకట్టుకున్న రకులేనా ఇప్పుడున్నది అని ఫ్యాన్స్ ఆశ్చర్యంతో చిరాకు పడేలా చేస్తుంది.ఒకప్పటి రకులే మాక్కావాలంటూ ఎన్నిసార్లు విన్నవించుకున్నా తనకేం కావాలో,ప్రేక్షకులు తననుండి ఏం కోరుకుంటున్నరో తనకి అర్దం కావట్లేదనుకుంటా.

అంతేలెండి హిట్స్ ఉన్నప్పుడు మనసు,మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాని ఒక్క అపజయాన్ని భరించే శక్తి చాలామందికి ఉండదు. ప్రస్తుతం రకుల్ పరిస్థితి అలానే ఉంది. ఒకవైపు ఒక్కటీ సరైన హిట్ లేదు,మరోవైపు తన పై వచ్చే ట్రోల్స్ తో బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది. కాని ఎప్పటిలా తనపై వచ్చే ట్రోల్స్ కి ఈ సారి రకుల్ కామ్ గా ఊరుకోలేదు. గట్టి కౌంటర్ ఇచ్చింది.

“కారులో సెషన్ అయిపోగానే ప్యాంట్ వేస్కోవడం మర్చిపోయావా అంటూ”రకుల్ ఫోటోకి ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. నా ప్లేస్ లో మీ ఇంట్లో వాళ్లుంటే ఇలాగే ప్రశ్నిస్తావా? నా విషయంలో టంగ్ స్లిప్ అవొద్దని మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చింది.. నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని అర్దం అవుతుంది. ఫేమస్ అవ్వడానికి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోనని బదులిచ్చింది.


End of Article

You may also like