Ads
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది.
Video Advertisement
అయితే రష్మిక అప్పుడపుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమెకి ట్రోలింగ్ కూడా ఎదురవుతుంది. ఇటీవల రష్మిక గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తూ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. ఇటీవల రష్మిక హెచ్ టి మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ వేడుకలో పాల్గొంది.
ఈ ఫంక్షన్ లో రష్మిక ధరించిన డ్రెస్ అందరిని మెస్మరైజ్ చేసింది. యువత, ఆమె ఫ్యాన్స్ అయితే రెడ్ డ్రెస్ లో రష్మిక అందాలు చూసి పిచ్చెక్కిపోయారు. కానీ ఈ డ్రెస్ వల్ల రష్మిక ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. రష్మిక ధరించిన డ్రెస్ చాలా పొట్టిగా ఉండడంతో పదే పదే అడ్జెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఫోటో గ్రాఫర్స్ తో రష్మిక మందన ఫోటో దిగే సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది.
ఆ డ్రెస్ ఆమెకి ఏమాత్రం సౌకర్యంగా లేదు అని అర్థం చేసుకోవచ్చు. దీనితో నెటిజన్లు రష్మికని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్రాక్షన్ కోసం ఇలా ఇబ్బందిగా అనిపించే డ్రెస్ లు వేసుకోవడం ఎందుకు అని నెటిజన్లు మండిపడుతున్నారు. మన ఇండియన్ డ్రెస్సుల్లో హీరోయిన్లు చాలా అందంగా, హాట్ గా ఉంటారు. వాళ్ళకి ఆ విషయం అర్థం కావడం లేదు అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
వెస్ట్రన్ డ్రెస్ లు వేసుకోవడానికి వీళ్ళేమైనా హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ లోపేజ్ అనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా రష్మిక ఇలాగే ట్రోలింగ్ కి గురైంది. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైనప్పుడు కూడా రష్మిక అన్ కంఫర్టబుల్ డ్రెస్ లో కనిపించింది. ప్రస్తుతం రష్మిక పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే తలపతి విజయ్ సరసన వారసుడు చిత్రంలో నటిస్తోంది.
End of Article