పదేళ్ల తెలుగు అమ్మాయిని సత్కరించిన ట్రంప్.

పదేళ్ల తెలుగు అమ్మాయిని సత్కరించిన ట్రంప్.

by Anudeep

Ads

కరోనావైరస్ సంక్షోభం సమయంలో ముందు వరుసలో ఉండి సహాయం చేస్తున్న అనేక మంది అమెరికన్ హీరోలకు అధ్యక్షుడు ట్రంప్ మరియు  మెలానియా ట్రంప్ శుక్రవారం సత్కరించారు..వారిలో  తెలుగు రాష్ట్రానికి చెందిన పదేళ్ల శ్రావ్య కూడా ఉండడం , మన దేశానికి గర్వకారంణం.. నర్సులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి తను తయారు చేసిన బిస్కట్స్ ను అందించి తన వంతు సాయం చేసింది అన్నపరెడ్డి శ్రావ్య.

Video Advertisement

గుంటూరుకి చెందిన అన్నపరెడ్డి శ్రావ్య తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హన్నోవర్ లో నివసిస్తుంది..తండ్రి అన్నపరెడ్డి విజయ్ రెడ్డి పార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు. తల్లి డాక్టర్ సీతా కల్లం. వీరు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరం వీరి స్వస్థలం..ఉద్యోగ రిత్యా అమెరికాలు స్థిరపడ్డారు.. శ్రావ్య తల్లి డాక్టర్ సీతా కల్లం  ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం నుండి తన ఎమ్ బిబిఎస్  ను పూర్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న పాండమెక్ సిట్యుయేషన్లో దేశానికి సేవ చేస్తున్న డాక్టర్లకు, ఇతర సిబ్బందికి తన వంతుగా ఏమైనా సాయం చేయాలనుకుంది శ్రావ్య..వెంటనే తనకు వచ్చిన ఆలోచనను అమలు చేసింది. డాక్టర్లలో  ఉత్సహం నింపేలా తన వంతుగా వంద బాక్సుల బిస్కెట్లు అందించింది.వారిని ప్రోత్సహిస్తూ రకరకా గ్రీటింగ్ కార్డులను పంపింది. ఈ చిన్నారి శ్రావ్య చేసిన చిన్న సాయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆకర్షించింది. ఆయనే స్వయంగా శ్రావ్యతో పాటు మరో ఇద్దరు బాలికలను వైట్ హౌజ్‌కు పిలిపించుకొని సత్కరించారు.

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పెద్దవాళ్లు వారికి తోచిన సాయం చేస్తుంటే, చిన్నపిల్లలు కూడా వారికి తోచిన సాయం చేస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. శ్రావ్యతో పాటుగా తన స్నేహితులు లైలా ఖాన్, లారెన్ మాట్నే ఇద్దరిని కూడా ట్రంప్ సత్కరించారు.


End of Article

You may also like