ప్రశ్నాపత్రాల లీక్ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా..? ట్విస్ట్ ఏంటంటే..?

ప్రశ్నాపత్రాల లీక్ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా..? ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

Ads

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇందులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న ప్రవీణ్ ఫోన్ లో విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. ప్రవీణ్ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు.. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

Video Advertisement

ఈ నెల 5వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకైనట్లు హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో లీకేజీకి పాల్పడింది టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ కాగా.. ప్రధాన నిందితులుగా రేణుక, లవుడ్యావత్ డాక్యా దంపతులు ఉన్నారు. ABN ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, రేణుకకు 2018లో వనపర్తిలో గురుకుల పాఠశాలలో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రేణుక వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

TSPSC paper leak issue..

రేణుక టీటీసీ చదివిన తమ్ముడికి ఏఈ ఉద్యోగం కావాలంటూ నమ్మించింది. డబ్బు ఆశ చూపి ప్రశ్నాపత్రాల కొనుగోలు చేసింది. అవే పేపర్లను ముందుగానే బేరం కుదుర్చుకున్న వారికి అప్పజెప్పి.. లక్షల రూపాయలు కాజేసింది. టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన టీచర్ రేణుక బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుడైన టీఎస్​పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ కుమార్‌కు అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.

TSPSC paper leak issue..

ప్ర‌వీణ్‌, రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇద్ద‌రూ క‌లిసి కార్యాల‌య ఇన్‌చార్జి కంప్యూట‌ర్ నుంచి వివిధ విభాగాల ప్ర‌శ్న‌ప‌త్రాలను పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నారు. వాటిని అదే ఆఫీసులో ప‌లు కాపీలు చేసిన ప్ర‌వీణ్‌.. రేణుక‌కు విక్ర‌యించాడు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న తర్వాత ప్రవీణ్ నుంచి వాటిని రేణుక, డాక్యా దంపతులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకున్న వారిని వెంటబెట్టుకుని గండీడ్ మండలం పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చినట్లు సమాచారం. అక్కడే వారితో రెండు రోజుల పాటు చదివించి.. పరీక్ష రాయించారు. తన తమ్ముడి పేరిట పేపర్స్ తీసుకున్న తర్వాత అత్యాశ తో క్యాండిడేట్లకు ఒక్కొక్కరికి పేపర్‌ను రూ.14 లక్షలకు బేరానికి పెట్టింది.

TSPSC paper leak issue..

గురుకుల పాఠ‌శాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న రేణుక ప్ర‌శ్న‌ప‌త్రాల వ్య‌వ‌హారం న‌డిపేందుకు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి  16 రోజులు సెల‌వులు పెట్టిన‌ట్టు తేలింది. ఇందుకోసం ప్రిన్సిపల్‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పిన‌ట్టు తెలిసింది. త‌న కుమారుడికి బాగోలేద‌ని ఒక‌సారి, మ‌రిది చ‌నిపోయాడ‌ని మ‌రోసారి.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ కేసులో ఆమె పాత్ర బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో ఆమెను స‌స్పెండ్ చేయ‌నున్న‌ట్టు గురుకుల సొసైటీ వ‌ర్గాలు తెలిపాయి.


End of Article

You may also like