Ads
ఈ సంవత్సరం, అంటే 2024 – 2025 తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ కి పాలక మండలి అనుమతి తెలిపింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు.
Video Advertisement
టీటీడీ వార్షిక బడ్జెట్ ని రూ.5,141.74 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టారు. అందులో రూ.5,122.80 కోట్ల బడ్జెట్ కి పాలకమండలి ఆమోదం తెలిపింది అని అన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంగళసూత్రాలని, అంటే బంగారు డాలర్లని భక్తులకి అందుబాటులోకి తీసుకువస్తాము అని కూడా చెప్పారు.
పోటు విభాగంలో ఉన్న 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి, వారి జీతాలని 15 వేలకి పెంచుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలలో పనిచేస్తున్న 51 మంది ఉపాధ్యాయుల జీతాలు కూడా 35 వేల నుండి 54 వేలకి ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాలలో ఉన్న అర్చకుల జీతాలు కూడా పెంచుతున్నారు. అంతే కాకుండా 56 వేదపారాయణదారుల పోస్టులు భర్తీ చేయాలి అని నిర్ణయించుకున్నారు.
వేద పండితుల పింఛన్ కూడా 10000 నుండి 12,000 కి పెంచారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి టీటీడీ ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు కేటాయించడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెల 3 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తాము అని, ఈ సదస్సుకి 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరు అవుతారు అని తెలిపారు. టీటీడీ పాలకమండలి బడ్జెట్ నుండి ఇంజనీరింగ్ విభాగం కోసం 350 కోట్లు కేటాయించింది.
ఇందులో హిందూ ధర్మ ప్రచార అనుబంధ ప్రాజెక్టుల కోసం 108.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్సిటీల గ్రాంట్స్ కోసం 173.31 కోట్లు కేటాయించారు. అంతే కాకుండా ఇంకా ఎన్నో సంస్థలకి గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు, పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు కేటాయించారు. స్విమ్స్ అస్పత్రిలో 300 పడక గదుల నుండి 1200 పడకగదులు పెంచడానికి 148 కోట్లతో టెండర్ ప్రకటనకు టీటీడీ ఆమోదం తెలిపారు.
2.5 కోట్ల రూపాయలతో సప్తగిరి సత్రంలో అభివృద్ధి పనులు చేయాలి అని నిర్ణయించారు. ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణ కోసం 10 కోట్లు మంజూరు చేయాలి అని వారు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి కూడా పాలకమండలి తమ ఆమోదాన్ని తెలిపారు. అంతే కాకుండా అన్నమయ్య భవన్ కూడా ఆధునికరించాలి అని నిర్ణయించుకొని, అందుకోసం 1.47 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ వర్ష ప్రణాళికని ఇలా రూపొందించారు.
శ్రీవారి హుండీ కానుకల రూపంలో దాదాపు 1,611 కోట్లు వస్తాయి అని అంచనా వేశారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 1,167 కోట్లు, ప్రసాదం విక్రయాలు ద్వారా 600 కోట్ల ఆదాయం వస్తుంది అని ఒక అంచనా వేశారు. కళ్యాణకట్ట రసీదుల ద్వారా 151.50 కోట్లు, కల్యాణమండపం ద్వారా 147 కోట్లు, గదులు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల విక్రయాల ద్వారా 448 కోట్ల ఆదాయం వస్తుంది అని అన్నారు. అంటే కాకుండా పుస్తకాల విగ్రహాల ద్వారా కూడా 35.25 కోట్లు, టోల్ గేట్, అగర్బత్తి, విద్య కళాశాల ద్వారా 74.50 కోట్లు ఆదాయం వస్తుంది అని బోర్డ్ అంచనా వేశారు.
End of Article