22 ఏళ్ల తర్వాత మళ్ళీ నాగార్జునతో కలిసి నటించిన ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? ఇంతకముందు ఏ సినిమాలో అంటే.?

22 ఏళ్ల తర్వాత మళ్ళీ నాగార్జునతో కలిసి నటించిన ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? ఇంతకముందు ఏ సినిమాలో అంటే.?

by Mohana Priya

నాగార్జున హీరోగా వచ్చిన సినిమా నా సామిరంగ థియేటర్లలో రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ డైరెక్టర్ గా మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

Video Advertisement

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా చాలా కలర్ ఫుల్ గా రూపొందించారు. పాటలు కూడా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ నాగార్జున. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించారు అని చెప్పాలి. యాక్టింగ్ దగ్గర నుండి స్టైలింగ్ వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నారు. చాలా కొత్తగా కూడా కనిపించారు.

ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత అయిన ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో నటించిన ఒక నటి దాదాపు 20 సంవత్సరాల క్రితం నాగార్జున నటించిన ఒక సినిమాలో నటించారు. ఆమె మధుమణి. మధుమణి సీరియల్ ప్రేక్షకులకి సుపరిచితురాలు. ఎన్నో సీరియల్స్ లో నటించిన మధుమణి, ఎన్నో సినిమాల్లో కూడా ముఖ్య  పాత్రల్లో నటించారు. ఇప్పుడు నా సామిరంగ సినిమాలో నాజర్ భార్యగా మధుమణి నటించారు.

this actor acted with nagarjuna after long time

అయితే మధుమణి అంతకుముందు నాగార్జున నటించిన ఒక సినిమాలో కూడా నటించారు. అదే సంతోషం సినిమా. సంతోషం సినిమాలో మధుమణి మల్లిక అనే ఒక పాత్రలో నటించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మధుమణి షేర్ చేసుకున్నారు. “మీతో నటించడం నాకు చాలా ప్రత్యేకమైనది. అలాగే మీ నిర్మాణంలో వచ్చిన సినిమాకి నేను నంది అవార్డు అందుకోవడం కూడా నేను సాధించిన వాటిలో నాకు గుర్తుండిపోయే ఒక మంచి జ్ఞాపకం.”

https://www.instagram.com/p/C17PhzPR32N/?utm_source=ig_web_copy_link

“నా సామిరంగ చాలా మంచి సినిమా. ఈ సినిమాని థియేటర్ లో చూడడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ మధుమణి సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక పోస్ట్ షేర్ చేశారు. సంతోషం సినిమా సమయంలో దిగిన ఫోటోని కూడా మధుమణి షేర్ చేశారు. నా సామిరంగ సినిమా మెమరీతో పాటు సంతోషం సినిమా జ్ఞాపకాన్ని కూడా గుర్తు చేశారు.

https://www.instagram.com/p/C1wgvR8RYsL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ALSO READ : ప్రశాంత్ వర్మకి పెళ్లి అయ్యిందా..? అతని భార్య ఏం చేస్తారంటే..?


You may also like

Leave a Comment