“తులసి”లో వెంకటేష్ కొడుకు గుర్తున్నాడా.? ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.!

“తులసి”లో వెంకటేష్ కొడుకు గుర్తున్నాడా.? ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.!

by Mohana Priya

Ads

విక్టరీ వెంకటేష్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా తులసి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించారు. శివాజీ ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ పోషించాడు మాస్టర్ అతులిత్. తులసి సినిమాలో వెంకటేష్ నయనతార కొడుకు పాత్రలో నటించాడు అతులిత్. తులసి సినిమాలో అతులిత్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Video Advertisement

 

అంత చిన్న వయసులో కూడా అంత బాగా నటించాడు అతులిత్. తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన మా నాన్న చిరంజీవి సినిమాలో కూడా కనిపించాడు. అలాగే స్వామి మణికంఠ సినిమాలో కూడా నటించాడు. అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన లడ్డు బాబు సినిమాలో భూమిక కొడుకుగా, హీరోని ఫాలో అయ్యే పాత్రలో నటించాడు అతులిత్.

 

ప్రముఖ గాయకులు ఘంటసాల గారి మీద రూపొందుతున్న బయోపిక్ లో కూడా నటించాడు అతులిత్. ఈ సినిమా టీజర్ 2018 లో విడుదలైంది. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య, ఘంటసాల గారి పాత్ర పోషిస్తున్నారు. విడుదలైన టీజర్ చూస్తుంటే ఘంటసాల గారి చిన్నప్పటి పాత్రలో అతులిత్ నటించినట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరో హీరోయిన్లుగా, లేకపోతే ముఖ్య పాత్రల్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఓ బేబీ సినిమాతో తేజ, వినవయ్యా రామయ్యా సినిమాతో నాగ అన్వేష్, ఆంధ్రా పోరి సినిమాతో ఆకాష్ పూరి, ఏబిసిడి సినిమాతో భరత్ ఇంకా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి రీ  – ఎంట్రీ ఇస్తున్నారు. భవిష్యత్తులో అతులిత్ కూడా మరిన్ని మంచి పాత్రలతో మనల్ని అలరించాలని ఆశిద్దాం.

 


End of Article

You may also like