“వాడి స్టైల్ వాళ్ళకి నచ్చలేదు..!” అంటూ… కొడుకుపై వస్తున్న ట్రోలింగ్ కి “ప్రభాకర్” కామెంట్స్..!

“వాడి స్టైల్ వాళ్ళకి నచ్చలేదు..!” అంటూ… కొడుకుపై వస్తున్న ట్రోలింగ్ కి “ప్రభాకర్” కామెంట్స్..!

by Anudeep

Ads

ఈ టీవీ ప్రభాకర్ గురించి మనందరికీ బాగా తెలిసిన విషయమే. దూరదర్శన్ ద్వారా తన కెరియర్ ప్రారంభించి ఆ తరువాత ప్రారంభించబడిన ఈ టీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు మిగతా ఛానల్స్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.

Video Advertisement

సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించి బుల్లితెర చిరంజీవి గా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా పలు సినిమాలలో దర్శకత్వం వహించాడు. నిర్మాతగా కూడా బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు.

prabhakar serious on trolls..
ఇక బుల్లితెరలో అత్యధిక పారితోషకం తీసుకొనే వారిలో ప్రభాకర్ మొదటి స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే ప్రభాకర్ తాజాగా తన కుమారుడు చంద్రహాస్ హీరో గా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన కొడుకు ఒకేసారి మూడు సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడంటూ ప్రభాకర్ తెలిపారు. తన కొడుకు చాలా హార్డ్ వర్కర్ అని.. మంచి హీరో అవుతాడని చెప్పారు. అయితే ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో చంద్రహాస్ నిలబడిన తీరుపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది.

అతను రెండు జేబులు చేతులు పెట్టుని స్టైల్‌గా యాట్యిట్యూడ్ చూపించడం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో మీమ్స్, వీడియోలతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ‘ఒక్క సినిమా కూడా తీయలేదు.. అప్పుడే అంత బలుపేంటి..’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.

prabhakar serious on trolls..
తన కొడుకు చంద్రహాస్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై ప్రభాకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”మా వాడు వచ్చిందే ఇప్పుడు. ఇంకా సినిమా రిలీజ్ కూడా కాలేదు. మొన్న వాడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫంక్షన్‌కే పిచ్చ ట్రోల్స్ చేశారు. ‘వీడు హీరో ఏంటి.. జేబులో చేతులు పెట్టాడంటే.. అటు తిరిగాడేంటి..? ఇటు తిరిగాడేంటి..?’ అంటూ ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేశారు.

prabhakar serious on trolls..
గుడ్..వాళ్లు తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. అనేది పక్కన పెడితే జనాలకు తెలిశాడు. తరువాత వాడు ఎంత బాగా చేస్తే.. అంతబాగా ఆదరిస్తారు. ఇప్పుడు వాడు నిలబడిన స్టైల్ వాళ్లకు నచ్చలేదు. అందుకే నచ్చలేదని చెప్పారు. వాడు చేసిన యాక్టింగ్ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. బాగా పర్ఫామెన్స్ చేస్తే మెచ్చుకుంటారు..” అంటూ చెప్పుకొచ్చారు ప్రభాకర్.
అంతే కాకుండా నా కొడుకుని సరదాగా ట్రోల్ చేస్తే పర్లేదు కానీ నెగటివ్ గా ట్రోల్ చేస్తే మాత్రం జైల్లో పెడతా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.


End of Article

You may also like