Ads
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం సినీప్రేక్షకులని అందరిని తీవ్రంగా బాధించింది.అంతే కాదు ఎంతగానో భవిష్యత్ ఉన్న నటుడు అకస్మాత్తుగా ఇలా మరణించటం ఎవరు..జీర్ణించుకోలేకపోతున్నారు.అయన మరణానికి మరచిపోలేని కొందరు అభిమానులు తీవ్రంగా ఒత్తిడికి లోనై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు .సినీరంగంలోని పరిస్థితులకు తీవ్రంగా మానసిక ఒత్తికిడికి లోనయే ఇలా చేసాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో,
Video Advertisement
బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ మరో బాంబు పేల్చారు..అదేంటంటే సుశాంత్ విషయంలో జరిగిన సంఘటనలే సంగీత పరిశ్రమలోనూ అతి త్వరలో మీరు చేస్తారని హెచ్చరించారు.అది ఒక గాయకుడే కావచ్చు,సంగీత దర్శకుడే కావచ్చు,పాటల రచయితే కావచ్చు అంటూ హెచ్చరించారు అంతే కాదు మూవీ మాఫియా లాగే మ్యూజిక్ మాఫియా కూడా ఉన్నది. అతి పెద్ద ప్రమాదకర మాఫియా అంటూచెప్పుకొచ్చారు.
తన ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా ఫాన్స్ కి ఒక వీడియో విడుదల చేసారు. ‘నేను అదృష్టవంతుడిని చిత్రపరిశ్రమకు ముందుగానే వచ్చాను..సంగీత పరిశ్రమని కూడా ఆ రెండు కంపెనీలు శాసిస్తున్నాయి.టాలెంట్ ఉన్నా యంగ్ సింగర్స్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ ని పైకి రానివ్వటం లేదు అని అన్నారు.ఏది ఏమైనా సుశాంత్ సంఘటన బాలీవుడ్ లో చాల దుమారం లేపిందనే చెప్పాలి.తాజగా సోను నిగమ్ చేసిన కామెంట్స్ కి బాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
End of Article