Home Filmy Adda “పుష్ప” అని చెప్పి భలే మోసం చేశారుగా..? బయట పడిన అసలు విషయం..!

“పుష్ప” అని చెప్పి భలే మోసం చేశారుగా..? బయట పడిన అసలు విషయం..!

by Anudeep

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన లేటెస్ట్ మూవీ పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో బ‌న్నీ స్మ‌గ్ల‌ర్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో న‌టించి అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. పుష్ప‌రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు యావ‌త్తు టాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇప్ప‌టికే ప‌లువురు సినిమా ప్ర‌ముఖులు పుష్ప సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అంద‌రికీ తెలిసిందే. పార్ట్ -1 బాగా హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు పుష్ప పార్ట్ -2 పై భారీగా అంచ‌నాలు పెరిగాయిని చెప్ప‌వ‌చ్చు. ఇదిలా ఉంటే పుష్ప గురించి మ‌రో తాజా వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

is this the leaked pic from pushpa 2..??know the truth..!!
ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఒక మెయిన్ క్యారెక్టర్ లుక్ లీక్​ అయింది అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి.. ఆ క్యారెక్టర్ మరేదో కాదు పుష్ప మూవీ మొదలు చివరి వరకు ఉండే కేశవ రోల్. ఈ క్యారెక్టర్ లుక్​​ ఫస్ట్ పార్ట్ లో చాలా నార్మల్‌గా ఉంటుంది. అల్లు అర్జున్ కి రైట్ హ్యాండ్‌గా ఉండే ఈ రోల్‌లో జగదీష్ ప్రతాప్ బండారి చేసాడు. ఈ యాక్టర్ కాస్త అమాయకంగా కూడా కనిపిస్తూ.. మచ్చా.. మచ్చా.. అంటూ అల్లు అర్జున్‌తో కలిసి నవ్వులు పూయించాడు.

is this the leaked pic from pushpa 2..??know the truth..!!

కేశవ రోల్ లాగా ఉన్న ఒక ఫోటోని వైరల్ చేస్తూ..రెండో భాగంలో కేశ‌వ పుష్ప‌కు వెన్నుపోటు పొడుస్తార‌ని, దీంతో హీరో కొత్త చిక్కుల్లో ప‌డ‌తార‌ని.. పుష్ప 2 స్టోరీ లీక్ అయ్యింది అంటూ నెట్టింట పలు కథనాలు వెల్లువెత్తాయి.

is this the leaked pic from pushpa 2..??know the truth..!!
దీంతో జనాలు కూడా అది పుష్ప కు సంబంధించిన లీక్ అయిన ఫోటో అనే నమ్ముతున్నారు. ఈ నేపథ్యం లో ఆ ఫోటో కి సంబంధించిన అసలు వార్త బయటకు వచ్చింది. అది అసలు పుష్ప సినిమా లోనే రోల్ ఏ కాదని ఫాన్స్ నిరూపించారు. అది నిజానికి వైష్ణవ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన రంగరంగ వైభవంగా చిత్రం లోని ఫోటో అని తేల్చారు. అందులో జగదీశ్ ఒక పాత్రలో నటించగా.. ఆ పాత్రకు సంబంధించిన పిక్ అని ప్రూవ్ చేస్తున్నారు అభిమానులు. వైష్ణవ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం అంత పెద్ద హిట్ కాక పోవడం తో జనాలకు ఈ పాత్ర గురించి తెలియక.. పుకార్లను నమ్మేశారు. అయితే ఈ తాజా వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

You may also like