Ads
నయనతార, విగ్నేష్ శివన్ సరోగసి వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరి వివాహం జూన్ నెలలో జరగగా కొద్ది రోజుల క్రితం తాము ఇద్దరు మగ బిడ్డలకు తల్లిదండ్రులమయ్యామని వారు ప్రకటించారు. వీరు ఇలా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారో లేదో వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.
Video Advertisement
నయనతార గర్భం ధరించినట్లు ఎక్కడ కనిపించకపోవడంతో దీంతో వారు అద్దెగర్భం ద్వారా పిల్లలను కని ఉంటారని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే జనవరి నెలలో భారతదేశం తీసుకువచ్చిన కొత్త సరోగసీ చట్టం ప్రకారం వీరిద్దరూ కనుక సరోగసి ద్వారా ఇప్పుడు పిల్లల్ని కంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్ అవుతుంది. ఐదేళ్లదాకా శిక్ష పడే విధంగా కూడా చట్టంలో పేర్కొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ప్రభుత్వం ఒక ముగ్గురు మెంబర్లతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ వ్యవహారం మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నయనతార, విగ్నేష్ శివన్ ని విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార మరియు విగ్నేష్ శివన్ తమ వివాహం ఆరేళ్ల క్రితమే జరిగిపోయింది అని ఆరోగ్య శాఖకు అఫిడవిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సరోగసీ విధానంలో కవలలకు జన్మనివ్వడంపై వస్తున్న విమర్శలకు అఫిడవిట్ రూపంలో పుల్ స్టాప్ పెడదామన్నది దంపతుల ప్రయత్నంగా కనిపిస్తోంది. తమిళనాడు వైద్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి తమ వివాహ సర్టిఫికెట్, అఫిడవిట్ ను విఘ్నేశ్, నయన్ సమర్పించినట్టు తెలిసింది. దీంతో ఆరేళ్ల క్రితమే వీరి పెళ్లి జరిగిందని అభిమానులు సైతం షాక్ కి గురి అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తమకు పెళ్లి ఆరేళ్లయినా పిల్లలు పుట్టలేదు కాబట్టే తాము అద్దెగర్భం ద్వారా ముందుకు వెళ్లామని ఈ జంట చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాక ఈ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఎవరు అనే విషయం మీద కూడా క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు. దుబాయిలో సెటిల్ అయిన ఒక మలయాళీ మహిళ నయన్ పిల్లలకి జన్మనిచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక ఏ హాస్పిటల్ అయితే ఆమె బిడ్డలకు జన్మనిచ్చిందో ఆ హాస్పిటల్ వివరాలు కూడా నయనతార దంపతులు అందజేసినట్లు సమాచారం.
End of Article