Home News అడ్డం తిరిగిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు కథ..! న్యాయం కావాలి అంటూ..?

అడ్డం తిరిగిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు కథ..! న్యాయం కావాలి అంటూ..?

by Anudeep

తిరుపతిలో భర్తతో ప్రియురాలికి పెళ్లి చేసిన భార్య అనే ఘటన ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోను, మీడియాలోనూ తెగ వైరల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ కొత్త వార్త బయటకి వచ్చింది.

అది ఏంటంటే.. ఆ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు కథ కాస్తా అడ్డం తిరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే రెండో భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. తనని అత్తమామలు కోడలిగా ఒప్పకున్న.. భర్త మాత్రం ఇష్టపడటం లేదని ఆరోపించింది. తన భర్త అనేక ఆరోపణలు చేసింది. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్తగా పెళ్లిచేసుకున్న అమ్మాయి నిత్యా అనేక విషయాలను తెలిపింది.

twist in wife gets married husband with lover viral news
నిత్యా మాట్లాడుతూ.. “మా ఇద్దరికి టిట్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా మేమిద్దరం మూడేళ్లుగా ప్రేమించుకున్నాము. అయితే పెళ్లి చేసుకుందామని నేను అడినప్పుడు ఉద్యోగం, చెల్లికి పెళ్లి చేయాలని అన్నాడు. దానికి నేను కూడా సరే అన్నాను. నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ క్రమంలోనే ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకునే వాళ్లం. మూడు, నాలుగు నెలలకు ఒకసారి కలుసుకుంటూ ఉండే వాళ్లం.

twist in wife gets married husband with lover viral news
అయితే ఈ లోపు ఆ అమ్మాయి ఎలా కలిసిందో, వారికి పరిచయం ఎలా ఏర్పడిందో నాకు తెలియదు. అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం ఆ అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులకు కూడా తెలియదు. అసలు వాస్తం జరిగింది వేరు.. వాళ్లు బయట ప్రపంచానికి చెప్పింది వేరు. అసలు వారిద్దరు పెళ్లి చేసుకున్నారు అనేదానికి ఆధారం ఏముంది?. ఆమెను పెళ్లి చేసుకున్నారు అన్నడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

twist in wife gets married husband with lover viral news
నా పెళ్లి..అబ్బాయి అమ్మానాన్న సమక్షంలో వెంకటేశ్వర స్వామి గుడిలో చేసుకున్నాము. కాబట్టి నా పెళ్లే చెల్లుబాటు అవుతోంది. భవిష్యతులో ఆ అమ్మాయితో ఏమైన ఇబ్బందులు రావచ్చు అనే కారణంతో నా పెళ్లి సమయంలో ఆమెను కూడా ఫోటో కోసం పక్కన ఉంచాను. అసలు ఆ అమెకి గతంలో ఓ పెళ్లి అయి.. నా భర్తను రెండో పెళ్లి చేసుకున్నాట్లు తెలిసింది. ఆమెకు ఓ బాబు కూడా ఉన్నాడు.

twist in wife gets married husband with lover viral news

మా అత్తమామలకు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు.నన్నే కోడలిగా భావిస్తున్నారు. మా ఆయన మాత్రం ఆమెతో ఎక్కువ రోజులు ఉంటున్నాడు. మధ్యలో గొడవల తర్వాత పెద్దల వద్ద పంచాయితీ పెట్టాము. వారు నెలలో ఇద్దరి వద్ద సగం సగం రోజులు ఉండాలని నిర్ణయించారు. అయితే 15 రోజులు కాదు కదా కేవలం ఐదు రోజులు అలా వచ్చి వెళ్లిపోతున్నాడు. నేను ఆమెకు అన్యాయం చేయమని చెప్పను. కానీ నాకు మాత్రం న్యాయం చేయాలి” అని నిత్యా తెలిపారు. ఈ విషయాలు తెలుసుకున్న నెటిజన్లు ఈ ఉదంతం గురించి చర్చించుకుంటున్నారు.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&v=372354738441604

You may also like