Ads
తాజాగా ట్విట్టర్ సీఈఓ గా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ భారతీయులు. టెక్ ప్రపంచంలో మరో భారతీయ నాయకుడు చేరాడు. పలు సంస్థల్లో భారతీయులు తమ టాలెంట్ తో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ట్విట్టర్ సంస్థలో తాను చేసిన సేవలకు గాను పరాగ్ అగర్వాల్ సీఈఓ పదవికి అర్హులయ్యారు.
Video Advertisement
మైక్రోసాఫ్ట్ కి ఓ సత్యనాదెళ్ల.., గూగుల్ కి సుందర్ పిచాయ్.. తాజాగాకి ట్విట్టర్ కి పరాగ్ అగర్వాల్.. ఇది భారతీయులకు గర్వించదగ్గ పరిణామం. మరి భారతీయులకు గర్వకారణమైన పరాగ్ అగర్వాల్ గురించి తెలుసుకుందాం.
పరాగ్ అగర్వాల్ రాత్రికి రాత్రే సీఈఓ అవ్వలేదు. ఆ స్థాయికి ఎదగడం వెనుక ఆయన కృషి ఎంతగానో ఉంది. మహర్షి సినిమాలో రిషి కూడా కాలేజీ లైఫ్ నుంచి బయటకు వచ్చాక.. ఎంప్లాయ్ గా మొదలై.. సీఈఓ స్థాయికి చేరుకుంటాడు. ఈ పరాగ్ అగర్వాల్ కూడా ఉద్యోగి స్థాయి నుంచి సీఈఓ స్థాయికి ఎదగడం వెనుక ఉన్న ఆయన కష్టాన్ని చూద్దాం. సోషల్ మీడియా అప్పుడప్పుడే ప్రజలకు చేరుతున్న సమయంలోనే ట్విట్టర్ కూడా పుట్టుకొచ్చింది. 2006 మార్చ్ 21న శాన్ ఫ్రాన్సిస్కో లోనే ట్విట్టర్ ఆవిష్కరణ జరిగింది. కానీ.. అప్పటికి సోషల్ మీడియా లో ఇంత చైతన్యం లేదు.
ట్విట్టర్ కంటే రెండు సంవత్సరాలకు ముందే ఫేస్ బుక్ వచ్చింది. నాలుగు సంవత్సరాలకు ముందే లింక్డ్ ఇన్ వచ్చింది. ప్రజలు ఎక్కువగా వీటినే ఉపయోగిస్తున్నారు. ఈ సమయం లో ట్విట్టర్ ప్రజలకు చేరువ అవ్వాలంటే కష్టమే. ఈ క్రమంలో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ఉండడం, సెక్యూరిటీ పరం గా టాప్ లో ఉండడం వంటి విషయాల్లో ట్విట్టర్ జాగ్రత్తలు తీసుకుంది.
ఫలితంగా ట్విట్టర్ కూడా ఈ పోటీని తట్టుకుని నిలబడగలిగింది. సెక్యూరిటీ టాప్ లో ఉండడంతో.. ఎక్కువగా సెలెబ్రిటీలు ట్విట్టర్ కే మొగ్గు చూపారు. ఈక్రమంలో ఫ్యాన్స్ కూడా ట్విట్టర్ వైపుకు రావడంతో ఫాలోయింగ్ పెరిగింది. ఆ టైములో సీఈఓ గా ఉన్న జాక్ డోర్సీ ఎనలేని పాత్ర పోషించారు. ఈ దశాబ్ద కాలంలో పరాగ్ అగర్వాల్ కూడా ట్విట్టర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన 2011 నుండి ట్విట్టర్ లోని వివిధ విభాగాలలో పనిచేసారు.
1983లో ముంబైలో జన్మించిన పరాగ్ చిన్నప్పటి నుంచి ఉత్సుకతతో సొంతంగా విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాసతో ఉండేవాడు. 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తయ్యాక.. అమెరికా వెళ్ళిపోయి పై చదువులు పూర్తి చేసారు. 2011 లోనే స్టాన్ఫోర్డ్ వర్సిటీ నుండి పీహెచ్డీ పూర్తి చేసిన పరాగ్ ట్విట్టర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యారు.
అయితే ఈ ఆఫర్ ఊరికే రాలేదు. పిహెచ్ డి చేసే సమయంలోనే పరాగ్ మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూ సంస్థలలో రీసెర్చ్ చేసారు. ఈ రీసెర్చ్ లో ఓ సాధారణ యూజర్ ఎలాంటి అంశాలు కోరుకుంటారు అన్న విషయమై పరాగ్ వివరణ ఇచ్చాడు. ఈ లాజిక్ అప్పటి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ కి బాగా నచ్చింది. ఇది ఎంత కష్టమైనదో..అవసరమైనదో ఆయన గుర్తించారు. అందుకే పరాగ్ కు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఆఫర్ ఇచ్చారు. అలా 2011 లో ట్విట్టర్ లో చేరిన పరాగ్ అగర్వాల్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సీఈఓ అయ్యారు.
End of Article