ఆడవాళ్లకు షాపింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కొందరు ఆడవాళ్లు ఒక్క చీర కొనడానికి రోజంతా షాపింగ్ చేయగలరు. అదే భారీ డిస్కౌంట్స్ తో చీరలు ఇస్తారు అన్నప్పుడు ఎంత దూరమైనా సరే అడ్రెస్ కనుక్కొని మరీ వెళ్తారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఇలాంటి ఆఫరే పెట్టారు. అయితే అక్కడ అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
Video Advertisement
వస్త్ర దుకాణాలు పండుగలు, ప్రత్యేక రోజుల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహిస్తాయి కదా.. అలాగే బెంగళూరులోని మైసూర్ సిల్క్ శారీ సెంటర్ కూడా ఇటీవల డిస్కౌంట్ సేల్ నిర్వహించింది. ఏ చీర అయినా సరే ఫ్రీగా పట్టుకెళ్లండి అంటూ ప్రకటించింది మైసూర్ సిల్క్స్ షాపింగ్ మాల్.
ఆ యాడ్ చూసిన వెంటనే పెద్ద ఎత్తున వచ్చేశారు మహిళలు. ఎవరికి నచ్చినవి వాళ్లు తీసుకున్నారు. అయితే ఉన్నట్టుంది అక్కడ అలజడి మొదలైంది. సరిగ్గా అప్పుడే ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. ఆ చీర కోసం ఒకరికొకరు పోటీ పడ్డారు. నాదంటే నాదంటూ కొట్టుకున్నారు. ఈ ఫైట్ ఎక్కడి వరకూ వెళ్లిందంటే…ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని మరీ లాక్కున్నారు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించినా అస్సలు పట్టించుకోలేదు.
ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకొచ్చారు. ఇద్దరినీ వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. అయినా ఊరుకోలేదు. ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకుంటూ మరింత రెచ్చిపోయారు. దీంతో మహిళలతో కిటకిటలాడుతున్న ఆ షాపింగ్ మాల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కొందరు మాత్రం ఏమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన చీరల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఓ యువతి ఈ తతంగాన్నంతా వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయింది. అప్పుడే లక్ష మంది ఈ వీడియోని చూశారు. వైరల్ అయిన ఈ వీడియో ని పై నెటిజన్‌లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “ఇంత గొడవకి కారణమైన ఆ చీరని చూడాలని ఉంది”. “శారీ అంటే జస్ట్ ఓ క్లాత్ కాదు. అదో ఎమోషన్” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
watch video: