Ads
మామూలుగా బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఏదైనా మంచి కంపెనీలో పని చేస్తారు. పైగా మంచి ప్యాకేజీలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఇంజనీరు మాత్రం కాస్త వెరైటీ. రుచికరమైన బిర్యానీ, చికెన్ టిక్కా వంటి వాటిని బండి మీద పెట్టి అమ్ముతారు. అదేమిటి బీటెక్ పూర్తి చేసి బండి పెట్టి బిర్యానీ వంటివి అమ్మడం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..? కాస్త కొత్తగా చూడడానికి వున్నా..సంపాదన మాత్రం ఎక్కువే. ఎంత నెలకి సంపాదిస్తున్నారు అన్నది చూస్తే షాక్ అవుతారు. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే…
Video Advertisement
ఇద్దరు ప్రొఫెషనల్ ఇంజనీర్లు ఒక బండిని స్టార్ట్ చేశారు. వాళ్లే సుమిత్ సమల్ , ప్రియం బెబర్తా. అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు. బీటెక్ పూర్తి కావడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు సాయంత్రం బయట బిర్యానీ తినడానికి వెళ్లేవారు. ఒక రోజు వీళ్ళిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. తాము ఎందుకు బిర్యానీ బండి పెట్టకూడదు అని.. అద్భుతమైన రుచి తో మంచి ఆహారాన్ని తయారు చేయాలని.. దానిని అమ్మాలని నిర్ణయించుకున్నారు.
ఇద్దరు చెఫ్స్ కాకపోయినా సరే ధైర్యం చేశారు. తల్లి తో వంట చేసేటప్పుడు ఇంట్లో బిర్యాని వండడం నేర్చుకున్నానని ప్రియం అన్నారు. మొదటి పెట్టుబడి కింద రూ. 50 వేలని పెట్టారు. ఆ తర్వాత వంట వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. వంట చేయడానికి వాటికి ఒక రూమ్ ని కూడా అద్దెకు తీసుకున్నారు. బయట బండి మీద ఆహారం కూడా ఇంట్లో లాగే ఉండాలనేది వారి ధ్యేయం. ప్రతి రోజు సాయంత్రం వాళ్ళు పని పూర్తి చేసుకుని తర్వాత ఒక హ్యాండ్ కార్ట్ ను తమ స్థలానికి తీసుకు వచ్చి దాని మీద చికెన్ బిర్యానీ అమ్ముతున్నారు. దీనితో రోజుకి ఎనిమిది వేల రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే నెలకు రెండున్నర లక్షల పైనే.
End of Article