భిక్షాటన చేసుకుంటున్న ఆ ఇద్దరినీ చేరదీసి స్కూల్ కి పంపారు.. కానీ రెండు నెలలు తిరిగేసరికి..?

భిక్షాటన చేసుకుంటున్న ఆ ఇద్దరినీ చేరదీసి స్కూల్ కి పంపారు.. కానీ రెండు నెలలు తిరిగేసరికి..?

by Anudeep

Ads

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు భిక్షాటన చేసుకుంటూ ఉండేవారు. వారిలో ఒకరిపేరు సమ్రీన్ కాగా.. మరొకరు నుస్రత్. సమ్రీన్ తొమ్మిదవ తరగతి చదువుతుండగా, నుస్రత్ ఎనిమిదవ తరగతి చదువుకుంటోంది. వీరిద్దరికి ఒక ఏడాది వయసు తేడా ఉంది.

Video Advertisement

వీరు రోడ్డు పై భిక్షాటన చేసుకుంటుంటే.. చైల్డ్‌లైన్‌వారు ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా చేరదీశారు. వీరిద్దరిని హైదరాబాద్ లోని చంద్రాయన్‌గుట్టలోని ఎంవీ ఫౌండేషన్‌ లో చేర్పించారు.

girls missing

ఓ రెండు నెలలు అయ్యాక.. వీరిని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల హాస్టల్‌ లోకి చేర్పించారు. కాగా.. రెండు రోజుల క్రితం మంచాల కస్తూర్బాగాంధీ గిరిజిన బాలికల హాస్టల్‌ నుంచి ఈ ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వెంటనే హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.

girls missing 2

ఇద్దరు బాలికలు శనివారం ఉదయమే హాస్టల్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇది గమనించిన హాస్టల్‌ వార్డెన్‌ శ్రీలతారెడ్డి చంద్రాయన్‌గుట్టలోని ఎంవీ ఫౌండేషన్‌ వారికి కూడా సమాచారం అందించారు. చుట్టూ పక్కల ప్రాంతాలలో ఎంతగా గాలించినా.. వీరి ఆచూకీ లభించలేదు. చివరకు, ఆదివారం నాడు మంచాల పోలీస్ స్టేషన్ లో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు ను నమోదు చేసారు.


End of Article

You may also like