ఇద్దరు కిలాడీలు లవర్స్ అయితే..? వీరి లవ్ స్టోరీ ఏంటో తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం..!

ఇద్దరు కిలాడీలు లవర్స్ అయితే..? వీరి లవ్ స్టోరీ ఏంటో తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం..!

by Anudeep

Ads

ఈ అబ్బాయి, అమ్మాయి గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరి చదువే ఇంకా పూర్తి కాలేదు. బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న వీరిద్దరూ ప్రేమ కారణంగా కిలాడీలుగా మారారు. అత్యాశకు పోయి ఆన్ లైన్ బెట్టింగ్ చేయాలనుకున్నారు. ఆ అబ్బాయి ఆన్ లైన్ బెట్టింగ్ లో లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.

Video Advertisement

ఆ డబ్బుని అక్కడా ఇక్కడా అప్పు చేసి కట్టాడు. అయితే.. అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరుగుతుండడంతో వీరిద్దరూ కిలాడీలుగా మారారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

students 1

సోమయంపాళ్యంకు చెందిన ఏ ప్రశాంత్, రామనాథపురానికి చెందిన హెచ్.తేజస్విని ఓ ప్రైవేట్ కాలేజీలో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ కు అలవాటు పడ్డ ప్రశాంత్ పదిహేను లక్షల వరకు అప్పు చేసాడు. ఆ డబ్బంతా బెట్టింగ్ లోనే పోయింది. మరో వైపు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి కూడా పెరుగుతూ వచ్చింది. దీనితో తన లవర్ తేజస్వినికి తన బాధ చెప్పుకున్నాడు.

students 2

ఇద్దరు కలిసి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయాలనుకున్నారు. అందుకోసం చైన్ స్నాచింగ్ ను ఎంచుకున్నారు. తేజస్వినికి స్కూటీ ఉండడంతో ఇద్దరు కలిసి ఓ రోజు మధ్యాహ్నం 2.30 సమయంలో తొండముత్తూరు వైపు వెళ్లారు. అక్కడ మేకలు మేపుతున్న ఓ వృద్ధురాలి మెడలో చైన్ ను దొంగిలించాలనుకున్నారు. ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి తేజస్విని అడ్రస్ అడుగుతూ ఉన్నట్లు నటించింది. ఈ క్రమంలో వెనక ప్రశాంత్ ఆమె చైన్ ను దొంగిలించి అక్కడ నుంచి పరార్ అయ్యారు.

st3udents

కాగా ఈ దొంగతనంపై ఫిర్యాదు నమోదు అయ్యింది. దీనితో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తేజస్విని బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ట్రేస్ చేసారు. ఆమెను పట్టుకుని నిలదీయగా ఆమె నేరం అంగీకరించింది. కాగా.. కొన్ని నెలల క్రితమే ప్రశాంత్ తండ్రి కూడా ఇంట్లో బంగారం కనిపించడం లేదని ఫిర్యాదు చేసారు. ప్రశాంత్ కూడా ఇంట్లో బంగారాన్ని దొంగిలించి అమ్మేసి.. ఆ డబ్బుని ఆన్ లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. అంతేకాదు తేజస్విని బంగారం కూడా ఇలానే బెట్టింగ్ లో పోయింది. చదువుకోవాల్సిన వయసులో వారు నడిచిన తప్పుల నడక వారిని కటకటాల వెనక్కి నెట్టింది.


End of Article

You may also like