Ads
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయిన అబుదాబి నగరంలో ఒక ఆలయం ప్రారంభానికి సిద్ధం అవుతోంది. ఆ ఆలయం బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో నిర్మితం అయ్యింది. ఈ ఆలయాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది.
Video Advertisement
ఆలయ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు, అంటే ఫిబ్రవరి 13వ తేదీన నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసించే భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుక అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ ఆహ్లాన్ మోడీ అని పేరు పెట్టారు. అంటే హలో మోడీ అని అర్థం.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయం నిర్మాణం కోసం 2015 లోనే భూమిని కేటాయించారు. 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టాలరెన్స్ అండ్ కో ఎక్సిస్టెన్స్ మంత్రి అయిన షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ చేతుల మీదుగా ఈ ఆలయ శంకుస్థాపన జరిగింది. ఈ ఆలయాన్ని పింక్ సాండ్ స్టోన్ తో రూపొందించారు. సాంప్రదాయం మరియు ఆధునికం వాస్తు కళలని కలిపి ఈ ఆలయాన్ని రూపొందించారు. అక్కడికి వేడి తట్టుకోవడానికి రాజస్థాన్ నుండి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని కూడా తీసుకువెళ్లి గుడి నిర్మాణానికి ఉపయోగించారు.
ఇందులో ఎన్నో అత్యంత టెక్నాలజీ తో ఉన్న ఫీచర్లు, సెన్సార్లని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో 7 గోపురాలని ఏర్పాటు చేశారు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఏడు ఎమిరేట్స్ కి ప్రతీకగా రూపొందించినట్టు చెప్పారు. ఇందులో మొత్తంగా 402 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం మీద దేవతలు, ఒంటెలు, ఏనుగులు, నెమళ్లు, సంగీత పరికరాలు వాయిస్తున్న ఎంతో మంది విద్వాంసులు, సూర్యచంద్రులు ఇలా ఎన్నో శిల్పాలని రూపొందించారు. ఈ ఆలయాన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 200 మంది శిల్పులు, కార్మికులు ఈ ఆలయం కోసం పనిచేశారు.
ఈ ఆలయ నిర్మాణానికి 3 సంవత్సరాల సమయం అయ్యింది. ఈ ఆలయం ఎత్తు 108 అడుగులు. ఈ ఆలయం నిర్మాణానికి 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాతిని, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుకరాతిని ఉపయోగించారు. అంతే కాకుండా 18 లక్షల ఇటుకలని కూడా ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాని త్రీడీలో రూపొందించారు. ఈ ఆలయం దర్శనానికి వచ్చే భక్తుల కోసం పర్యాటకుల కేంద్రం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రార్థనా మందిరం, ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకోవడానికి కొంత ఆట స్థలం వంటివి కూడా కేటాయించారు వీటితో పాటు తాగునీరు, బుక్ షాప్స్, ఫుడ్ కోర్ట్, గిఫ్ట్ షాప్స్, థీమ్ పార్క్ వంటివి కూడా నిర్మించారు.
దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన స్వామి మహారాజ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. ఒకవేళ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటే, ఫెస్టివల్ ఆఫ్ హార్మోని వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. ఫిబ్రవరి 14వ తేదీ మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభం అవుతోంది. త్రీడీలో రూపొందించిన రామ మందిరం నమూనా చూస్తూ ఉంటే సాక్షాత్తు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా, ఈ ఆలయంలో అధునాతన టెక్నాలజీతో ఇంకా ఎన్నో సౌకర్యాలని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ : ఛత్రపతి శివాజీకి “ఖడ్గాన్ని” ఇచ్చింది శ్రీశైలం భ్రమరాంబిక దేవి అని మీకు తెలుసా.? 1677 లో ఏం జరిగిందంటే.?
End of Article