ఫోన్ పోయిన 8 నెలల తర్వాత తిరిగిచ్చిన ఉబర్ డ్రైవర్.. ఇంతకీ ఏమి జరిగిందంటే..?

ఫోన్ పోయిన 8 నెలల తర్వాత తిరిగిచ్చిన ఉబర్ డ్రైవర్.. ఇంతకీ ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

ఎప్పుడైనా ఆటో లో కానీ, టాక్సీలలో గాని మన వస్తువుల విషయం లో అప్రమత్తం గానే ఉండాలి. ఏమైనా పోతే అవి తిరిగి దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇదే పరిస్థితి లండన్‌కు చెందిన షాయ్ సాదే అనే మహిళకు ఎదురైంది. ఆమె ఓ రోజు క్యాబ్ బుక్ చేసుకుని తన ఫోన్ ను క్యాబ్ లో మరిచిపోయింది.

Video Advertisement

mobile phone

ఆ తర్వాత బాగ్ లో వెతుక్కుంది.. ఇల్లంతా వెతికింది.. కానీ ఫోన్ మాత్రం దొరకలేదు. ఆ రోజు ఆమె చాల టాక్సీలలో తిరిగింది. ఎక్కడ ఫోన్ మర్చిపోయిందో ఆమెకు తెలియదు. దీనితో.. ఆమె ఫోన్ పై ఆశలు వదిలేసుకుంది. ఎనిమిది నెలలు తరువాత ఆమె ఓ క్యాబ్ ఎక్కింది. మీరు నా క్యాబ్ లో ఫోన్ పడేసుకున్నారు కదా… అంటూ ఆ డ్రైవర్ ఆమె ఫోన్ ను చూపించి అడిగాడు. ఆమె తన ఫోన్ ను గుర్తుపట్టి తీసుకుంది. ఆమె ఏ క్యాబ్ లో ఫోన్ పడేసుకుందో దాదాపు 8 నెలల తరువాత అదే క్యాబ్ లో మళ్ళీ ఎక్కింది. ఆరోజు తాను ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అయి ఉండడం తో ఫోన్ రింగ్ అవలేదు. అప్పటినుంచి ఆ డ్రైవర్ ఆ ఫోన్ ని ఆన్ చేయలేదట. అతనికి ఆ ఫోన్ వాడుకునే ఉద్దేశ్యం లేకపోవడం తోనే ఆన్ చేయలేదట.


End of Article

You may also like