Ads
ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితమే. ఎన్నో మంచి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయ్యారు. మనసంతా నువ్వే, నువ్వే నువ్వే వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపును పొందారు.
Video Advertisement
కానీ ఆ తర్వాత తాను చేసిన సినిమాలేవీ కూడా మంచి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కాలం కలిసి రాకనో ఎంచుకునే సినిమాల్లో తప్పు చేశాడు ఏమో కానీ డిజాస్టర్ గా మిగిలాయి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని సినీ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు ఉదయ్ కిరణ్. కానీ ఇంకా ప్రేక్షకులు ఉదయ్ కిరణ్ ని మర్చిపోలేదు.
ఇదిలా ఉంటే దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ సినిమా సమయంలో ఉదయ్ కిరణ్ అనుకోని కారణం చేత అక్కడే కో డైరెక్టర్ ని బాగా తిట్టారని అన్నారు. డైరెక్టర్లను ఏమీ అనకూడదు అని నిర్ణయం తీసుకున్న ఉదయ్ కిరణ్ కో డైరెక్టర్ ని కొట్టగానే అది చూసి అంతా షాక్ అయ్యామని చెప్పారు.
సినిమాల కారణంగా ఫ్రస్ట్రేషన్ లో ఉదయ్ కిరణ్ డైరెక్టర్ పై మండిపడ్డారని అన్నారు. వెంటనే నేను ఆ సమయంలో ప్యాకప్ చెప్పేసి వచ్చేసాను అని ఆయన చెప్పారు. ఉదయ్ కిరణ్ వేరే సినిమా రిలీజ్ విషయంలో వచ్చిన సమస్య కారణంగా కోపాన్ని తట్టుకోలేక ఈ విధంగా ప్రవర్తించారు అని అన్నారు. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ ని సినీ ఇండస్ట్రీ కోల్పోయిందని ఇది నిజంగా బాధాకరమని అన్నారు.
End of Article