Ads
ఉదయ్ కిరణ్ చివరి సినిమా అయిన చిత్రం చెప్పిన కథ ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నిర్మాత థియేటర్లో రిలీజ్ చేయాలని ట్రై చేసి మళ్ళీ ఊరుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ చివరి సారి తనని సినిమాలో చూడాలి అని ఎదురు చూసి చూసి ఆగిపోయారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృశ్యా థియేటర్ రిలీజ్ కన్నా కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ బెటర్ అని భావించిన యూనిట్ ఎవరైనా OTT యాప్స్ తమ దగ్గరికి వస్తే ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయలాని భావిస్తున్నారట.
Video Advertisement
కొన్ని చిన్న యాప్స్ వస్తున్నప్పటికీ వాటి రీచ్ చాలా తక్కువ ఉంటుందని ఆగుతున్నారట. ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెలిసి సినిమా ఎలాగైనా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.చిత్ర పరిశ్రమలోని ఒత్తిళ్లకు లోనై ఇటీవలే బలవన్మరణం చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్.టాలీవుడ్ లో కూడా ఇదే రీతిలో ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు.
మంచి భవిష్యత్ ఉన్న ఒక గొప్ప హీరోలు ఇలా మధ్యలోనే తనువు చాలించడం..ఎవరికి అర్థం కావడం లేదు..ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం,నువ్వు నేను,మనసంతా నువ్వే,శ్రీరామ్. చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసందే.సుశాంత్ కి ఉదయకిరణ్ చాల పోలికలు ఉన్నాయ్ అంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఉదయ్ కిరణ్ ఫాన్స్ కోసం నిర్మాతలు చేస్తున్న మంచి ప్రయత్నం. సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.
End of Article