Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
సినిమాకి ఎడిటింగ్ ఒక మెయిన్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకి ఎడిటర్‌గా చేసిన వ్యక్తి పేరు ఉజ్వల్ కులకర్ణి. ఉజ్వల్ వయసు కేవలం 19 సంవత్సరాలే. ఉజ్వల్ అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి ఎడిటర్ గా చేసారు. ఉజ్వల్ వర్క్ నచ్చడంతో ప్రశాంత్ నీల్ కేజీఫ్ సినిమాకి ఎడిటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి సినిమాలు అంటే అనుభవం ఉన్న వారిని తీసుకుంటారు. కానీ ఇంత చిన్న వయసులో కూడా ఉజ్వల్ అనుభవం ఉన్న వారిలాగా చేసారు అని అందరు పొగుడుతున్నారు.
సినిమా ఇంత విజయం సాధించడంలో ఎడిటింగ్ ముఖ్య పాత్ర పోషించింది. ఆలా ఉజ్వల్ కి కూడా ఈ సినిమాతో కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియన్ రేంజ్ లో పేరు వచ్చింది. సినిమాకి ప్రస్తుతం హిట్ టాక్ వస్తోంది. మొదటి పార్ట్ తో పోలిస్తే ఈ సినిమా చాలా పవర్ ఫుల్ గా ఉంది అని అంటున్నారు. ఈ సినిమాతో యష్ మరొకసారి పాన్ ఇండియన్ రేంజ్ లో గుర్తింపు సంపాదించారు.
End of Article