Ads
ప్రభాస్, కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోందని నేషనల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంది. వీరిద్దరూ ఆది పురుష్ చిత్రం లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్ పై ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. అంతే కాకుండా కృతి సనన్, వరుణ్ ధావన్ నటించిన భేడియా చిత్ర ప్రమోషన్స్ సమయం లోనూ పరోక్షంగా దీనిపై చర్చలు జరిగాయి. దీంతో తామిద్దరి మధ్య ఏమి లేదని కృతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Video Advertisement
అలాగే ప్రభాస్ కూడా ఇటీవల ఒక టాక్ షో లో వారిద్దరి మధ్య అలాంటి బంధం ఏం లేదని తేల్చి చెప్పేసాడు. కానీ వీరిద్దరూ గురించి వస్తున్న వార్తలు ఆగలేదు. అయితే ఈ విషయం పై తాజాగా మరోసారి ప్రముఖ రివ్యూయర్, క్రిటిక్ అయిన ఉమైర్ సంధూ ట్వీట్ చేసాడు. దీంతో ప్రభాస్ ఫాన్స్ మండిపడుతున్నారు. ఉమైర్ సంధూ నిత్యం పలు సినిమాలపై, సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూ ఉంటాడు.
తాజాగా మరోసారి ప్రభాస్-కృతి బంధంపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ” వచ్చే వారం లో ప్రభాస్ – కృతిసనన్ మాల్దీవ్స్ లో నిశ్చితార్థం చేసుకోనున్నారు.” అని ఉమైర్ ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు. ఇంతకుముందు కూడా వీరి బంధం పై ఉమైర్ సందు పలు ట్వీట్స్ చేసాడు. అవేమి నిజం కావని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
“మీ బంధాన్ని ఎందుకు దాస్తున్నావ్ కృతి సనన్..?? ధైర్యం ఉంటే అందరి ముందు ఒప్పుకో..” అంటూ ఒకసారి.. “అధికారికంగా చెబుతున్నాను.. ఆదిపురుష్ షూటింగ్ లో కృతిసనన్ కు ప్రభాస్ యే లవ్ ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే నిశ్చితార్థం..” అంటూ మరోసారి ఆయన తన ఖాతా లో పోస్ట్ చేసాడు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని ప్రభాస్ అభిమానులు ఉమైర్ సంధుని ట్రోల్ చేస్తున్నారు. ‘ఎంగేజ్మెంట్ అన్న విషయం వాళ్ళిద్దరికీ అయినా తెలుసా..’ అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు నెటిజన్లు.
End of Article