కన్నతల్లి ముందే తమ్ముడిని గొడ్డలితో నరికి చంపేశాడు.. ఈ హత్యకి కారణం తెలిస్తే కన్నీళ్లు పెడతారు..!

కన్నతల్లి ముందే తమ్ముడిని గొడ్డలితో నరికి చంపేశాడు.. ఈ హత్యకి కారణం తెలిస్తే కన్నీళ్లు పెడతారు..!

by Anudeep

Ads

ఇటీవల ఆస్తి కోసం చాలానే గొడవలు జరుగుతున్నాయి. అన్న దమ్ముల మధ్య ఆస్తి తగాదాలు సహజంగానే వస్తూ ఉంటాయి. అయితే.. ఈ ఇద్దరు అన్న తమ్ముల మధ్య గొడవ చాలా దూరం వెళ్ళింది. ఎంతవరకంటే కన్నా తల్లి ముందే తమ్ముడిని గొడ్డలితో నరికి చంపేంత వరకు. ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది.

Video Advertisement

ఆస్థి కారణంగా ఆ అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. తమ్ముడే కదా అని అన్న కనికరించలేదు.. పెద్దోడు కదా పోనిలే అని తమ్ముడు కూడా వెనక్కి తగ్గలేదు. దీనితో తగవు మరింత ముదిరింది.

rangadhamuni palli

వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తిర్మాలాపూర్‌ గ్రామానికి చెందిన రాజవ్వకు ముగ్గురు కొడుకులు ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు నర్సయ్య బ్రతకడానికి గల్ఫ్ కు వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు గోపాల్ మనస్పర్థల కారణంగా భార్యతో విడిపోయాడు. ప్రస్తుతం తన అన్న ఊరు అయిన రంగధామునిపల్లెలో ఉంటున్నాడు. మూడవ కొడుకు శ్రీకాంత్ కు ఇంకా పెళ్లి అవలేదు. హైద్రాబాద్లో ఉండి పని చేసుకుంటూ అప్పుడప్పుడు తిర్మలాపూర్ కు వచ్చి పోతూ ఉంటున్నాడు.

rangadhamuni palli 1

కుమార్తె కూడా భర్తతో గొడవ పడి తల్లి వద్దే ఉంటోంది. రాజవ్వ, పోషయ్య దంపతులకు 20కుంటల భూమి ఉంది. దానిని నలుగురికీ సమానంగానే పంచారు. అయితే మూడవ కొడుకు శ్రీకాంత్ తన వాటాగా వచ్చిన 6 కుంటల భూమిని అమ్మేసుకుని వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాడు. అయితే అతని అన్న గోపాల్ ఆ భూమిని బయటివాళ్ళకి అమ్మడానికి ఇష్టపడలేదు. ఆ భూమి తనకే అమ్మాలని కోరాడు. అయితే అందుకు తమ్ముడు శ్రీకాంత్ ఒప్పుకోలేదు.

rangadhamuni palli 2

ఈ క్రమంలో వారిద్దరికీ గొడవ మొదలైంది. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీకాంత్ తన వాటా గా వచ్చిన భూమిని అమ్ముకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. తన భూమిని తాను అమ్ముకుంటానని అన్న గోపాల్ కు తెగేసి చెప్పేసాడు. దీనితో కోపోద్రిక్తుడైన గోపాల్ ఆవేశంలో కన్న తల్లి, సోదరి ముందే శ్రీకాంత్ ను గొడ్డలితో నరికేశాడు. శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీకాంత్ రక్తపు మడుగులో పడిపోయి ఉండడాన్ని చూసి ఆ కన్న తల్లి స్పృహ తప్పి పడిపోయింది. జరిగిన దారుణాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ కోటేశ్వర్, ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి జరిగిన విషయం తెలుసుకుని గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు.


End of Article

You may also like