అందుకోసం ఆ రోడ్ పై ఆగకపోయి ఉంటె.. వీరు ప్రాణాలతో ఉండేవారు.. అసలు ఏమి జరిగిందంటే..?

అందుకోసం ఆ రోడ్ పై ఆగకపోయి ఉంటె.. వీరు ప్రాణాలతో ఉండేవారు.. అసలు ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవ్వరం ఊహించలేము. ఈ నిమిషం బానే ఉన్నా.. మరో నిమిషానికి ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో ఊహించడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. ఒక్కోసారి ఇలాంటి ప్రమాదాలలో ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. తాజాగా.. విశాఖ-అరకు రహదారిపై ఇటువంటి ప్రమాదమే చోటు చేసుకుంది.

Video Advertisement

వివరాల్లోకి వెళితే, కిల్లో సోనాపతి అనే వ్యక్తి ఎస్‌.కోటలో నివాసం ఉంటున్నారు. అతను విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సోనాపతికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

accident 1

భార్య పిల్లలతో కలిసి సోనాపతి బైక్ పై శివలింగపురం వెళ్తున్నారు. మార్గం మధ్యలో తాటి ముంజలు కనిపించడంతో అవి కొనుక్కుందాం అని ఆగారు. వీరు బైక్ ఆపిన సమయంలోనే అటుగా అరకు నుండి కాకినాడకు వెళ్తున్న ఓ కార్ వచ్చింది. అనుకోకుండా, రోడ్డు పక్కనే ఆపిన సోనాపతి బైక్ ను ఆ కార్ ఢీ కొట్టింది. బైక్ పైనే కూర్చుని ఉన్న సోనాపతి కుమారులు శ్రావణ్‌(7), సుహాస్‌(4) ఎగిరి రోడ్డుపై పడ్డారు.

కింద పడడంతో వారి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. సోనాపతి ని ఆసుపత్రికి తీసుకెళ్లి, చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలవలేదు. ఆయన భార్య శ్రావణి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే మరో బైక్ పై ఉన్న ఎస్‌.కోట మండలం పెదఖండేపల్లికి చెందిన కొసరు అప్పారావు మరియు అతని తమ్ముడి కూతురు సుహిత (5) కూడా తీవ్రంగా గాయపడ్డారు.


End of Article

You may also like