సొంత అక్క ఇంటికి వెళ్తూ బావ మనసు దోచేసింది.. చివరికి వీళ్లిద్దరు ఎంత పని చేసారంటే..?

సొంత అక్క ఇంటికి వెళ్తూ బావ మనసు దోచేసింది.. చివరికి వీళ్లిద్దరు ఎంత పని చేసారంటే..?

by Anudeep

Ads

ఓ అమ్మాయి తన సొంత అక్కకే ద్రోహం చేసింది. సొంత అక్క కాపురం బాగుండాలని.. తన అక్క భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. కానీ, ఈ అమ్మాయి మాత్రం తన అక్క భర్తతో తానె సంతోషంగా ఉండాలని కోరుకుంది. చివరకు ఈ అమ్మాయి తన బావతో కలిసి ఎంత పని చేసిందో చూడండి..

Video Advertisement

ఓ వ్యక్తికి మూడేళ్ళ క్రితమే వివాహమైంది. ఓ బాబు కూడా ఉన్నాడు. 2020 లో వీరికి కుమారుడు జన్మించాడు. వీరి ఇంటికి తరచుగా అత్తమామలు, భార్య సోదరి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే భార్య సోదరిపై అతను మనసు పారేసుకున్నాడు.

cheating 1

representative image

ఇద్దరు ఇష్టపడడం వలన ఆ అమ్మాయి కాపురం చిక్కులలో పడింది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ లో నివాసం ఉంటున్న పింటూ రాజ్ భర్ అనే వ్యక్తి కల్యాణ్‌పూర్‌కు చెందిన ఓ అమ్మాయిని 2019 లో వివాహం చేసుకున్నాడు. వీరికి గతేడాది ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇది ఇలా ఉంటె పింటూ తన భార్య చెల్లెలితోనే ప్రేమలో పడ్డాడు.

cheating 2

representative image

మరోవైపు ఆ చెల్లి కూడా బావతో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కొన్నాళ్ళకు వీరు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. పింటూ ఆమెను నేరుగా ఇంటికే తీసుకెళ్లాడు. అయితే.. సొంత చెల్లెలే సవతి కావడంతో ఆ యువతి ఖంగుతింది. ఈ వివాహానికి అభ్యంతరం పెట్టింది. దీనితో ఆ చెల్లి, భర్త ఇద్దరు కలిసి ఆమెను కుమారుడితో సహా బయటకి గెంటేశారు. ప్రస్తుతం వీరిద్దరికి కూడా ఓ కుమారుడు జన్మించారు. అయితే ఆ అక్క మాత్రం తనకు న్యాయం చేయాలంటూ కోర్ట్ ని ఆశ్రయించింది. ఈ విషయమై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.


End of Article

You may also like