Home News బాబు ని మరదలికి అప్పచెప్పి.. భార్యతో బయటకు వెళ్ళాడు.. తిరిగొచ్చేలోపు ఊహించని ఘోరం..ఏమైందంటే..?

బాబు ని మరదలికి అప్పచెప్పి.. భార్యతో బయటకు వెళ్ళాడు.. తిరిగొచ్చేలోపు ఊహించని ఘోరం..ఏమైందంటే..?

by Anudeep

నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంటకి ఓ బాబు ఉన్నాడు. ఆ వ్యక్తి మైలాన్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతని భార్య టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ గా పని చేస్తోంది. ఆమె చెల్లి కూడా సాఫ్ట్ వేర్ గా పని చేస్తూ.. వారితోనే ఉంటోంది. ముగ్గురు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ.. ఆర్ధిక పరమైన ఇబ్బందులేవీ లేకుండా హ్యాపీ గా ఉంటున్నారు.

hyderabad couple

హటాత్తు గా వారిపై విధి దాడి చేసింది. కరీం నగర్ రామగుండం మండలం దద్దోజిపేట కు చెందిన శ్రీధర్ (34) , అతని భార్య దీపికా (28) హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరికి హనీష్ (3) అనే బాబు కూడా ఉన్నాడు. దీపికా చెల్లి కూడా వీరితోనే ఉంటోంది. శనివారం సాయం సమయం లో చిన్న పని ఉందని, తిరిగి వచ్చే వరకు బాబును చూసుకోవాలని మరదలికి అప్ప చెప్పి భార్య భర్తలు ఇద్దరు బయటకు వెళ్లారు.

bike accident

తిరిగి వస్తున్నా సమయం లో అల్వీన్ కాలనీకి వెళ్లే రహదారి కూడలి వద్ద అనుకోని ఘోరం జరిగిపోయింది. అతివేగం తో వెళ్తున్న టిప్పర్ లారీ ఒకటి వీరి బైక్ ను గుద్దడం తో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీపికా కు తీవ్రం గా గాయాలవడం తో ఆమెను పఠాన్ చెరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు. వారి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆ పసివాడు అమ్మా, నాన్న అంటూ పిలుస్తుంటే.. స్థానికుల హృదయాలు ద్రవించిపోయాయి.

You may also like