ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. చావు పుట్టుకలను ఎవరూ నిర్ణయించలేరు అన్న సంగతి అందరికి తెలిసిందే. అయినా, అకస్మాత్తు గా చావు మీదికొస్తే ఎవరికైనా భీతి కలుగుతుంది. ఎంతో ఆరోగ్యం గా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కోసారి చావు ముందుకొస్తే నేలకొరిగిపోతుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి ఒక జిమ్ లో జరిగింది. ఇది సిసి కెమెరా లో రికార్డు అయింది.

young man 2

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. సూరత్ లోని గోల్డ్ జిమ్ లో ఓ వ్యక్తి జిమ్ కి వచ్చాడు. వయసు సుమారు గా 33 సంవత్సరాలు ఉండొచ్చు. జిమ్ లో ఎక్సర్సైజ్ లు చేస్తూ ఉండగానే ఉన్నట్లుండి అతనికి గుండె నొప్పి వచ్చింది. కొంతసేపు విరామం తీసుకుందామని మెట్లపై వచ్చి కూర్చున్నాడు. అయినప్పటికీ అతనికి గుండెనొప్పి తగ్గలేదు. మంచి నీరు తాగి, ప్రశాంతం గా కూర్చోవాలని ప్రయత్నించినప్పటికీ అతని పరిస్థితిలో మార్పులేదు.

young man 3

కొంతసేపు అటూ ఇటూ తిరిగి చూసాడు. అంతకంతకూ నొప్పి ఎక్కువై.. ఉన్నట్లుండి మెట్లమీద నుంచి పడిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. తరువాత వైద్యులు చూస్తే.. అతను అప్పటికే మరణించాడని తెలిసింది. ఆరోగ్యం గా ఉండి, 33 ఏళ్ల వయసులోనే గుండెపోటు తో చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పరిమితి కి మించి వ్యాయామం చేయడం వలన ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.