Ads
ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉంటారో ఆ పైవాడే నిర్ణయిస్తూ ఉంటారు అంటుంటారు. కొన్ని కొన్ని లవ్ స్టోరీలు ఎప్పుడు ఎలా మొదలవుతాయి ఎవ్వరమూ చెప్పలేము. అలాంటిదే ఈ లవ్ స్టోరీ కూడా. చాలా విచిత్రంగా మొదలైన ఈ లవ్ స్టోరీ ఏంటో చూస్తే మీ గుండె కూడా ఝల్లుమనడం ఖాయం.
Video Advertisement
ఈ కింద ఫొటోలో కనిపిస్తున్నది చాందిని చంద్రన్, అరుణ్ సుదర్శన్. చాందిని మొదటి నుంచి చదువులో టాపర్. ఐఏఎస్ చదవాలనేది ఆమె లక్ష్యం. అందుకోసం సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేది.
ఈ క్రమంలోనే ఆమె 2016 లో సివిల్స్ పరీక్షకు హాజరు అయ్యింది. ఆరోజు పరీక్షలైపోయాయి.. విద్యార్థులందరూ హుషారుగా ఇంటి బాట పట్టారు. మనసులో మూడ్ కి తగ్గట్లే సన్నగా తొలకరి జల్లు మొదలైంది. దీంతో ఎవరికైనా వేడి వేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది. అనుకున్నదే తడవుగా చాందిని తన ఫ్రెండ్ అరుణ్ ని ఫోన్ చేసి పిలిచింది. వానగా ఉండడంతో అరుణ్ గొడుగు తీసుకుని వచ్చాడు.
గొడుగు కింద ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈలోగా అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్ట్ వీరిద్దరిని ఫోటో తీసాడు. ఫ్రెండ్ కదా అని అరుణ్ కూడా ఆమెను దగ్గరగా పట్టుకుని నడుస్తుండడంతో వారిని చూడగానే చూడ చక్కనైన జంట అనుకుంటారు ఎవరైనా. సదరు జర్నలిస్ట్ కూడా పాపం అలానే అనుకున్నాడు. పరీక్షలైపోయాయి.. ఫలితాలు వచ్చాయి. చాందిని సివిల్స్ టాపర్ అయ్యింది. దీనితో ఆమె ఫోటోలు మరేవీ లేకపోవడంతో సదరు జర్నలిస్ట్ ఆ జంటగా ఉన్న ఫోటోనే ప్రచురించాడు.
దానికి తగ్గట్లు “భర్త తో కలిసి గెలుపుని ఎంజాయ్ చేస్తున్న టాపర్” అంటూ ఓ కాప్షన్ ని కూడా పెట్టాడు. ఇది చూసిన ఆ జంట ఖంగుతింది. మొదట్లో వాళ్లిద్దరూ ఈ వార్తని ఖండించారు. కానీ, వారు చెప్పిందే నిజం చేయచ్చు కదా..? అని భావించారు. వారి బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి భార్యా భర్తలు అయ్యారు. ప్రస్తుతం చాందిని త్రిపుర జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. మరోవైపు అరుణ్ అక్కడే ఆర్ధిక వ్యవహారాల నిపుణుడిగా పని చేస్తున్నారు. అందుకే అంటుంటారు.. కొన్ని లవ్ స్టోరీలు ఎప్పుడు మొదలవుతాయి అనేది చెప్పలేం అని.
End of Article