Ads
కరోనా మహమ్మారి ఎన్ని కష్టాలను తీసుకొచ్చిందో చెప్పలేం. దాదాపు ప్రతి రంగానికి ఈ మహమ్మారి దెబ్బ తగిలింది. ఇక ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి మరింత దారుణం గా తయారైంది. స్కూల్స్ తెరుచుకోక, పాఠశాలలు నడపలేక ఇప్పటికే చాలా మంది అవస్థ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా దాదాపు నిరుద్యోగులైపోతున్నారు. కొందరు తమకు తోచిన ఉపాధిని వెతుక్కుంటున్నారు.
Video Advertisement
ఈ పరిస్థితిలో కర్నూలు జిల్లా కు చెందిన లైఫ్ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తం గా కలకలం సృష్టిస్తోంది. సుబ్రహ్మణ్యం, మరియు అతని భార్య రోహిణి ఓ వివాహ వేడుక కు హాజరు అయి వస్తూ.. తిరిగి వస్తున్న దారిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియో ను రికార్డు చేసారు.
తమ చావుకు శ్రీను, బాలాజీ సింగ్ కుమారుడు, సుమన్, సునీల్ కుమార్ చేసిన వేధింపులేనని పేర్కొన్నారు. వీరిద్దరూ కోవెల కుంట్ల పట్టణం లో లైఫ్ ఎనర్జీ స్కూల్ అనే పాఠశాలను నడుపుతున్నారు. ఇందుకోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్దే దాదాపు రెండు కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. కరోనా కారణం గా స్కూల్ నడిపే పరిస్థితి లేక అప్పులు తీర్చలేక అవస్థ పడ్డారు. మరో వైపు విద్యార్థుల తల్లితండ్రులు కూడా అమ్మ ఒడి డబ్బులు పడ్డాక ఫీజులు కడతామని చెప్పడం, అమ్మఒడి డబ్బులు పడిన తరువాత కూడా ఫీజులు కట్టకపోవడం తో వీరు నష్టాలపాలు అవ్వాల్సి వచ్చింది.
ఈ క్రమం లో అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకురావడం తో వీరు మనస్థాపానికి గురి అయ్యారు. వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ.. తమ ఆత్మహత్య కు కారణం ఎవరో చెబుతూ సెల్ఫీ వీడియో ను రికార్డు చేసారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే విషగుళికలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. కోవెల కుంట్ల కు వస్తూ దారిలోనే విషగుళికలు మింగడం తో అస్వస్థత కు లోనయ్యారు. బంధువులు వెంటనే అక్కడకి చేరుకొని వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దారిలోనే వారు మరణించారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రమంతా కలకలం రేపుతోంది. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
End of Article