51 సంవత్సరాలకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన… శరవణ స్టోర్స్ “శరవణన్” గురించి ఈ 10 విషయాలు తెలుసా..?

51 సంవత్సరాలకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన… శరవణ స్టోర్స్ “శరవణన్” గురించి ఈ 10 విషయాలు తెలుసా..?

by Anudeep

నటనకి వయసు, డబ్బుతో సంబంధం లేదు. ప్యాషన్, కష్టపడే మనస్తత్వం ఉండాలని అంటారు కానీ డబ్బు అనేది కచ్చితంగా ఉండాలనేది బహిరంగ రహస్యమే. అసలు విషయానికి వస్తే..

Video Advertisement

‘ది లెజెండ్’ అనే మూవీ తో 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమవుతున్నాడు లెజెండ్‌ శరవణన్‌. ఈ సినిమా అనేక భాషల్లో పాన్-ఇండియా మూవీగా రిలీజ్ అయింది. ఇందులో ఊర్వశి రౌతేలా హీరోయిన్ కాగా వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు ఇందులో నటించారు.

జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌ గా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం హీరో పై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతపెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఎలా వచ్చారు అనే అనుమానం కూడా జనాల్లో ఉంది. అసలు ఈ హీరో ఎవరు, అతనికి సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం..

1.  1970వ సంవత్సరంలో చెన్నైలో శరవణన్ జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత తన తండ్రిలానే శరవణన్ కూడా బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

2. మొదట్లో ఈయన క్లోతింగ్, ఫర్నిచర్, జ్యువెలరీ వంటి వ్యాపారాలను చూసుకున్నారు. కొన్ని వందల కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపారాలు ఇవి.

3. శరవణ స్టోర్స్ స్థాపించిన వారిలో ఒకరైన శరవణన్ సెల్వ రత్నమ్ కొడుకే ఈ ఆరుళ్ శరవణన్.

4. తమిళనాడులో శరవణ స్టోర్స్.. అంటే తెలియని వారంటూ ఉండరు. టెక్స్ట్ టైల్స్ , జ్యువెలరీ స్టోర్స్ తో పాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు వంటివి అన్నీ ఈ శరవణన్ స్టోర్స్ లో లభిస్తాయి.

 

5. చిన్నప్పటి నుండి ఇతనికి నటుడవ్వాలి అనే కోరిక కూడా ఉంది. కానీ అందుకు చాలా కారణాలు అడ్డుపడ్డాయి. మోడల్ గా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడంతో నటుడిగా కూడా మారాలని డెసైట్ అయ్యాడు శరవణన్.

6. అలా అని శరవణన్ డబ్బులు వెదజల్లి సినిమా మొదలుపెట్టలేదు. మొదట చెన్నైలో ఉన్న ‘అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో’ యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత ‘ది లెజెండ్ శరవణ స్టోర్స్ కంపెనీ’ బ్యానర్ పై ‘ది లెజెండ్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

7.  అరుళ్ కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, మోడల్ కూడా. తన ‘శరవణ స్టోర్స్’ కు తనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

8. శరవణన్ కు సూర్య శ్రీ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 2017 జూన్ లో సోదరి వివాహం సందర్భంగా రూ.15 కోట్ల విలువైన దుస్తులు అరుళ్ బహూకరించాడు. ఈ న్యూస్ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది.

9. కె.డి.-జెర్రీ ది లెజెండ్ చిత్రానికి దర్శకులు. గతంలో వీరు అజిత్ తో ‘ఉల్లాసం’ అనే మూవీని తెరకెక్కించారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. మార్చి 9, 2022న ‘ది లెజెండ్’ టైటిల్‌ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శరవణన్ సైంటిస్ట్ గా కనిపించారు.

10. తమన్నా, హన్సిక వంటి స్టార్ హీరోయిన్లతో 2019లో శరవణ్ రూపొందించిన ప్రచార చిత్రాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.


You may also like