ఆ ఫైట్ మాస్టర్ కావాలనే 24 మెట్ల మీద నుంచి కిందకి లాగారంట…హీరోయిన్ సంచలన కామెంట్స్.!

ఆ ఫైట్ మాస్టర్ కావాలనే 24 మెట్ల మీద నుంచి కిందకి లాగారంట…హీరోయిన్ సంచలన కామెంట్స్.!

by Anudeep

Ads

ఈమెను చూడగానే గుర్తు పట్టేసి ఉంటారు. ఆమె పేరు వరలక్ష్మి. ఒకప్పటి తరం లో అస్సలు ఖాళి లేని యాక్టర్ తను. చిన్న వయసులోనే నటించడం మొదలు పెట్టారు. బేబీ పాత్రలతో మొదలు పెట్టి, శ్రీమతి పాత్రల వరకు అన్ని చేసారు. ఆమెకు హీరోయిన్ అవ్వాలని ఉండేదట. అయితే, చిన్నప్పుడే అవకాశాలు రావడం తో బేబీ పాత్రలను చేసేది. దాదాపు ఆమెకు పన్నెండు సంవత్సరాలు వచ్చేవరకు ఆమెకు బేబీ పాత్రల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత రావడం తగ్గాయట. దీనితో, వరలక్ష్మి ని ఆమె తండ్రి హీరోయిన్ చెయ్యాలనుకున్నారట.

Video Advertisement

varalakshmi

కానీ, అప్పటికి ఆమె వయసు చిన్నది కావడం తో హీరోయిన్ అవకాశాలు రావడం కష్టమే అని భావించారు. అయితే, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటుండగా, ఓ సినిమా లో చెల్లెలు పాత్ర చేసే అవకాశం వరలక్ష్మి ని వరించింది. అలా మొదలై, ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాల వరకు చెల్లెలి పాత్రల్లో కనిపించి మెప్పించింది. అయితే, వరలక్ష్మి కి మాత్రం హీరోయిన్ అవ్వాలని ఉండేది.

ఆ రోజుల్లో మాత్రం తనకి ఎక్కువ గా చెల్లెలి పాత్రలే వచ్చేవి. మాములు గా అయితే, హీరో హీరోయిన్ల డేట్ల కోసం ఎదురు చూసేవారు. కానీ హీరో హీరోయిన్ల డేట్లు దొరికినా, వరలక్ష్మి డేట్లు మాత్రం కష్టమయ్యేది. హీరో, హీరోయిన్లు చాలామంది ఉండేవారు.కానీ, చెల్లెలి పాత్రలు చేసేవారు తక్కువ మంది ఉన్నారు. అందుకే వరలక్ష్మి కి ఇష్టం లేకపోయినా చెల్లెలి పాత్రలు వేయించుకునే వారు.

varalakshmi 1

షూటింగ్ లలో బిజీ గా ఉండే సమయాల్లో.. ఫైట్ మాస్టర్ తనని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఓ సారి తండ్రికి చెప్పుకున్నారు. అయితే, సినిమా షాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం అలా చేస్తారు పట్టించుకోకు అంటూ తండ్రి చెప్పడం తో ఆమె సర్దిచెప్పుకున్నారు. ఆ తరువాత అశ్వద్ధామ సినిమా షూటింగ్ లో ఫైట్ సీన్ లో.. వరలక్ష్మిని రెండు మెట్ల నుంచి కిందకి లాగమని దర్శకుడు ఫైట్ మాస్టర్ కు చెప్పాడు. కానీ, ఆ ఫైట్ మాస్టర్ 24 మెట్ల మీద నుంచి కిందకి లాగాడు. ఆ దెబ్బకి ఆమె కింద పడి, నడుము భాగం లో విపరీతమైన దెబ్బ తగిలింది. అది ఆ టైం లో గొడవ లాగా అయింది. అయితే, ఫైట్ మాస్టర్ వచ్చి సారీ చెప్పడం తో ఆ గొడవ అక్కడ ముగిసింది.

varalakshmi 2

కానీ ఆమె నటనా జీవితం లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఎక్కువ గా ఆమె క్యారెక్టర్లు పరిగెత్తేవి, చిన్నపాటి ఫీట్స్ చేసేవి గా ఉండేవి. దీనితో ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత, ఓ సారి కృష్ణ గారి సినిమా లో కూడా ఓ రేప్ సీన్ ఉన్న టైం లో కూడా ఆమె ను బాగా పరిగెత్తించారు. బాగా దెబ్బలు కూడా తగిలాయి. అప్పటికి తాను కడుపుతో ఉన్నానని, అయినప్పటికి, తాను ఏమి మాట్లాడలేదని, సైలెంట్ గానే యాక్ట్ చేయాలనుకున్నానని ఆరోజుల్ని ఇప్పటికి వరలక్ష్మి గుర్తు చేసుకుంటుంటారు. అయితే, ఆమె ను ఆ పరిస్థితి లో చూసిన కృష్ణ గారు వారిని మందలించారు. రేప్ సీన్ చేయడానికి ఆమె ని ఇంత ఇబ్బంది పెట్టాలా అని మందలించి, షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేసి అక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళిపొమ్మని చెప్పారు అంటూ వరలక్ష్మి ఆరోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కూడా ఆమె పలు సినిమాలలో చేసారు.


End of Article

You may also like