హీరో ఆర్యన్ రాజేష్ భార్య “సుభాషిణి” గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

హీరో ఆర్యన్ రాజేష్ భార్య “సుభాషిణి” గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

by Anudeep

Ads

తెలుగు సినిమాల దర్శకులలో జంధ్యాల శిష్యుడు ఇవివి సత్యనారాయణ గురించి చెప్పుకోకుండా ఉండలేము. కుటుంబ సమేతం గా నవ్వుకుంటూ సంతోషం గా సినిమాలు చూడాలి అంటే.. దర్శకుడు ఇవివి సత్యనారాయణ సినిమాలు చూడొచ్చు అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పుకోవచ్చు.

Video Advertisement

అంతలా ఆయన పేరు సంపాదించేసుకున్నారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లు ఇద్దరూ టాలీవుడ్ హీరోలు గా రాణించారు.

అల్లరి నరేష్ తన టాలెంట్ ను నేటికీ ప్రూవ్ చేసుకుంటూ.. ప్రేక్షకులను ఎన్నో వినోదభరితమైన చిత్రాలతో అలరించారు. ఆర్యన్ రాజేష్ కూడా మొదట్లో బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తరువాత సినిమాలు తగ్గించారు. ఆర్యన్ రాజేష్ తన తండ్రి స్నేహితుడి కుమార్తె సుభాషిణి ని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే.

aryan rajesh 2

తొలుత సుభాషిణి ఫోటో ను పంపి పెళ్లి చేసుకోవాలని కోరగా.. రాజేష్ ఒప్పుకోలేదట. ఆ తరువాత ఆమెను డైరెక్ట్ గా చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. 2011 జనవరి 5 న వీరికి పెళ్లి చూపులు జరిగాయట. దురదృష్టమేమిటంటే.. పెళ్లి చూపులు జరిగిన వారానికే.. అంటే జనవరి 11 న ఇవివి గారు మరణించారు. ఆ సమయం లో సుభాషిణి కుటుంబమే వారికి అండగా నిలిచారట. పెళ్ళికి ముందే.. తమ కష్టాలలో సుభాషిణి పాలు పంచుకుంది అంటూ ఆర్యన్ రాజేష్ ఓ సారి ఓ ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.

aryan rajesh 3

ఆ తరువాత 2012 ఫిబ్రవరి 12 న సుభాషిణి ని రాజేష్ పెళ్లి చేసుకున్నారట. వీరికి పెళ్లి అయిన సంవత్సర కాలానికి ఓ కుమారుడు జన్మించారు. దీనితో.. ఇవివి నే మళ్ళీ పుట్టారు అని కుటుంబమంతా సంతోషించింది. ఆ తరువాత 2015 లో మే29న అల్లరి నరేష్ కూడా చెన్నై అమ్మాయి విరూప ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like