Home Filmy Adda జబర్దస్త్ లో లేడీ కమెడియన్ పవిత్ర గురించి ఈ విషయాలు తెలుసా..? జబర్దస్త్ లోకి ఎలా వచ్చారంటే..?

జబర్దస్త్ లో లేడీ కమెడియన్ పవిత్ర గురించి ఈ విషయాలు తెలుసా..? జబర్దస్త్ లోకి ఎలా వచ్చారంటే..?

by Anudeep

జబర్దస్త్.. ఎందరో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు.. ఎందరో ఆర్టిస్ట్ లకు ఓ దారిని కూడా చూపించింది. జబర్దస్త్ మొదలైన తొలినాళ్లలో ఎక్కువ గా అబ్బాయిలే ఆర్టిస్ట్ లు గా ఉండే వారు. ఆడ ఆర్టిస్ట్ లు అవసరం అయినప్పుడు కూడా మగవారే ఆడవారి గెటప్ లు వేసి అలరిస్తూ ఉండేవారు. అదో యూనీక్ గా చాలాకాలం జబర్దస్త్ లో కొనసాగింది.

jabardast pavitra 2

ఆ తరువాత మొదటి లేడీ కమెడియన్ గా సత్య వచ్చారు. ఆమె చమ్మక్ చంద్ర టీం లో స్కిట్ లు వేస్తూ అలరించారు.ఆ దారిలోనే.. రోహిణి, వర్ష, ఫాతిమా వంటి ఆర్టిస్ట్ లు వచ్చి మగ ఆర్టిస్ట్ లకు ధీటుగానే టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే.. తాజాగా.. ఈ దోవలోకే పవిత్ర కూడా వచ్చారు. దాదాపు అందరి టీం లీడర్ల స్కిట్ లలోను అవసరం అయితే ఆక్ట్ చేస్తూ పంచ్ లు వేస్తూ, వేయించుకుంటోంది.

jabardast pavitra

వెంకీ మంకీస్, భాస్కర్, హైపర్ ఆది.. ఇలా ప్రతి టీం స్కిట్ లో ఈమె కనిపిస్తుంది. తక్కువ కాలం లోనే మంచి కామెడీ ని అందిస్తూ ప్రేక్షకులకు చేరువైంది. ఇంతకీ ఈమెకు జబర్దస్త్ లో అవకాశం ఎలా వచ్చిందో తెలియదు కదూ.. ఈమె టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయింది. అలా జబర్దస్త్ లోను అవకాశం వచ్చింది. మరో వైపు షార్ట్ ఫిలిం లో కూడా నటిస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది.

You may also like