Ads
కొన్ని సినిమాలు విడుదల అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకులకి మాత్రం గుర్తుండిపోతాయి. ఈ జాబితాకు చెందిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సంవత్సరం జనవరికి నువ్వొస్తానంటే నేనొద్దంటానా విడుదలయ్యి 17 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి కూడా ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ సినిమాగా ఉండే ఉంటుంది.
Video Advertisement
ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. రియల్ స్టార్ శ్రీహరి గారు ముఖ్య పాత్ర పోషించారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న టైంలో లవ్ స్టోరీ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అయితే ఈ సినిమాకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ని తొమ్మిది భాషల్లో రీమేక్ చేశారు. అన్ని భాషల్లో రీమేక్ అయిన ఇండియన్ సినిమాగా రికార్డు సాధించింది నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఆ సినిమాలు ఏంటంటే.
#1 తమిళ్
తమిళ్ లో ఉనక్కుం ఎనక్కుం పేరుతో రీమేక్ చేశారు. ఇందులో జయం రవి హీరోగా నటించగా, హీరోయిన్ గా త్రిష నటించారు.
#2 కన్నడ
కన్నడలో నీనెల్లో నానల్లే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో అనిరుధ్, రక్షిత హీరో హీరోయిన్లుగా నటించారు.
#3 బెంగాలీ
బెంగాలీలో ఐ లవ్ యూ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా 2007 లో విడుదల అయ్యింది.
#4 మణిపురి
మణిపురి లో నింగోల్ తజాబా పేరుతో రీమేక్ చేశారు.
#5 ఒడియా
ఒడియా లో సునా చాధీ మో రూపా చాధీ పేరుతో రీమేక్ చేశారు.
#6 పంజాబీ
పంజాబీ లో తేరా మేరా కీ రిష్తా పేరుతో రీమేక్ చేశారు.
#7 బంగ్లాదేశీ బెంగాలీ
బంగ్లాదేశీ బెంగాలీ లో నిస్సాష్ అమర్ తుమీ పేరుతో రీమేక్ చేశారు.
#8 నేపాలీ
నేపాలీ లో ద ఫ్లాష్ బ్యాక్ – ఫర్కేరా హెర్దా పేరుతో రీమేక్ చేశారు.
#9 హిందీ
హిందీలో రామయ్యా వస్తావయ్యా పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో గిరీష్ కుమార్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించగా, శ్రీహరి గారు చేసిన పాత్రను హిందీలో సోనుసూద్ పోషించారు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
రీమేక్ లో మాత్రమే కాకుండా అవార్డులలో కూడా రికార్డు సాధించింది నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమా గెలుచుకున్న అవార్డులు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఫిలింఫేర్ అవార్డ్స్
# బెస్ట్ ఫిలిం – ఎమ్మెస్ రాజు (నిర్మాత)
# బెస్ట్ యాక్టర్ – సిద్ధార్థ్ నారాయణ్
# బెస్ట్ యాక్ట్రెస్ – త్రిష
# బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శ్రీహరి
# బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవి శ్రీ ప్రసాద్
# బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – శంకర్ మహదేవన్ (చంద్రుళ్ళో ఉండే కుందేలు)
# బెస్ట్ లిరిసిస్ట్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి
# బెస్ట్ కొరియోగ్రఫీ – ప్రభుదేవా
# బెస్ట్ అవుట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – దేవి శ్రీ ప్రసాద్
నంది అవార్డ్స్
# బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిలిం – ఎమ్మెస్ రాజు
# బెస్ట్ యాక్ట్రెస్ -త్రిష
# బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శ్రీహరి
# బెస్ట్ కమెడియన్ – సంతోషిణి
# బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – వివేక్
సంతోషం ఫిల్మ్ అవార్డ్స్
# బెస్ట్ యాక్ట్రెస్ – త్రిష
# బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్
ఇవి మాత్రమే కాకుండా 2013లో సిద్ధార్థ్, హన్సిక హీరో హీరోయిన్లుగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన తీయ వేలై సెయ్యనుమ్ కుమరు సినిమాని తెలుగులో సంథింగ్ సంథింగ్ పేరుతో డబ్ చేశారు.
End of Article