Ads
ప్రతి ఒక్కరికి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తారు. కొంతమంది కెరియర్ కి, ఇంకా కొంతమంది డబ్బు కి ఇలా ప్రతి మనిషి కొన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకుంటారు కొన్ని విషయాలను వదిలేస్తారు. కానీ ఈ అభిప్రాయాలు ఉండటానికి ముఖ్య కారణం గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలే.
Video Advertisement
అలా మన ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 30 దాటినా కూడా వాళ్ల వ్యక్తిగత కారణాల వల్ల కెరియర్ కి ప్రాముఖ్యతనిచ్చి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. వాళ్ళలో కొంతమంది ఎవరంటే.
#1 అనుష్క శెట్టి
ఇప్పటి హీరోయిన్లు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి స్ఫూర్తి గా నిలిచిన అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఎవరికీ తెలియదు. అనుష్క కాంట్రవర్సీల కి చాలా దూరంగా ఉంటుంది. ఇంకా ఆమె వ్యక్తిగత జీవితం కూడా అసలు బయటికి రాదు. ఒక ఇంటర్వ్యూలో మాత్రం తను అన్నింటికీ సమయం ఉంటుంది అని నమ్ముతుంది అని, పెళ్లికి కూడా సమయం వచ్చినప్పుడు చేసుకుంటుందని, అంతేగాని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయం వృధా చెయ్యదు అని చెప్పింది.
#2 కాజల్ అగర్వాల్
చాలామంది కాజల్ అగర్వాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అని క్యూరియాసిటీ తో ఎదురుచూస్తున్నారు. కాజల్ మాత్రం తన ఇంట్లో వాళ్లకి లేని టెన్షన్ మీకెందుకు అని బహిరంగంగానే చెప్పేసింది.
#3 ఇలియానా
ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ లో ఉంది అని పెళ్లి కూడా అయింది అని వార్తలు వచ్చాయి. ఇద్దరి ఫోటోలు కూడా ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రేకప్ అయింది అనే వార్త బయటకు వచ్చింది.
#4 నిత్యా మీనన్
నిత్యా మీనన్ కూడా ఇంటర్వ్యూ లకు దూరంగా ఉంటుంది. సినిమా ప్రమోషన్ కోసం తప్ప మీడియాతో ఎక్కువగా మాట్లాడదు. కాబట్టి ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయం ఎవరికీ తెలీదు. ప్రస్తుతం నటనే కాకుండా డైరెక్షన్ వైపు కూడా వెళ్లనుంది. ఇటీవల హిందీలో వచ్చిన బ్రీత్ వెబ్ సిరీస్ తో అక్కడ కూడా మంచి నటి అనే పేరు సంపాదించుకుంది నిత్య.
#5 కత్రినా కైఫ్
ముందు సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉంది. తర్వాత గొడవల వల్ల ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత రణబీర్ కపూర్, కత్రీనా కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. సల్మాన్, కత్రీనా విడిపోయినా కూడా ఇప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితుల లానే ఉంటున్నారు.
#6 ఛార్మి
జ్యోతిలక్ష్మి తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు ఛార్మి. పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ హౌస్ లో భాగస్వామిగా ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా నిర్మించింది. ఎన్నో ఇంటర్వ్యూలలో ఛార్మిని ప్రేమ గురించి పెళ్లి గురించి అడిగారు. అయినా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు ఛార్మి.
#7 అంజలి
తెలుగమ్మాయి అయిన అంజలి తెలుగు ఇండస్ట్రీలో కంటే తమిళ ఇండస్ట్రీ లోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. జర్నీ సినిమాలో తనతో పాటు నటించిన హీరో జై తో ప్రేమలో ఉంది అనే వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఎవరికీ తెలీదు.
#8 త్రిష
కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ మణియన్ అనే ఒక వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం అయ్యింది. కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు. త్రిష కూడా పెళ్లి గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో అడిగినా కానీ సమాధానం చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడలేదు.
#9 శృతిహాసన్
మైఖేల్ కోర్సేల్ తో ఎంతో కాలం రిలేషన్ షిప్ లో ఉన్న శృతి తర్వాత విడిపోతున్నాం అని సోషల్ మీడియా లో ఒక పోస్టు ద్వారా చెప్పింది. ఇద్దరికీ కుదరదని విడిపోయామని కానీ ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం అని, ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని అని చెప్పింది శృతి.
#10 నయనతార
నయనతార, నేను రౌడీ నే సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారని విగ్నేష్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇద్దరూ ప్రేమ గురించి గానీ పెళ్లి గురించి గానీ ఎక్కడ మాట్లాడరు.
వీళ్లే కాకుండా ఈ జాబితాలో తమన్నా, సదా, కమలిని ముఖర్జీ, ఆండ్రియా, సీనియర్ హీరోయిన్లు టబు, శోభన ఇంకా ఎంతో మంది ఉన్నారు.
End of Article