Ads
Unstoppable with NBK 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆహాలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. సీజన్ 2 లో ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఆ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. చివరిగా టెలికాస్ట్ అయిన 4వ ఎపిసోడ్ లో బాలకృష్ణతో డిగ్రీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలతో పాటు బాలయ్యతో స్కూల్ లో చదువుకున్న అలనాటి హీరోయిన్ రాధిక వచ్చి అలరించారు.
Video Advertisement
అయితే అన్ స్టాపబుల్ 2 కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్న కూడా తొలి సీజన్ స్థాయిలో రెండవ సీజన్ కు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందులోనూ ఎపిసోడ్ కు ఎపిసోడ్ గ్యాప్ వస్తోందని, ఇది కూడా కారణమని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈవారం కూడా న్యూ ఎపిసోడ్ ఉండదని కామెంట్లు చేస్తున్నారు.
కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య షోకు 5వ ఎపిసోడ్ కు ఆహా ఫౌండర్స్ లో ఒకరైన అల్లు అరవింద్, తెలుగు దర్శకులలో గొప్పగా చెప్పుకునే కె రాఘవేంద్రరావు, టాప్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు వస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ ఎపిసోడ్ లో సినీ రంగం గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అన్ స్టాపబుల్ షో కోసం ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు షో నిర్వాహకులు.ఆహా ఓటీటీకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగడంతో, అది బాలకృష్ణ షో వల్లే ఆహా సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని అంటున్నారు. బాలకృష్ణ కూడా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య షో వల్లే ఆహా రేంజ్ ను పెరిగిందని కొందరు అంటున్నారు. అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో ప్రతి ఎపిసోడ్ ని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా రాబోయే ఎపిసోడ్స్ ని మరింత గ్రాండ్ గా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు.
End of Article