తన రూటే సపరేటు – ఉపాసన

తన రూటే సపరేటు – ఉపాసన

by Anudeep

Ads

తన రూటే సపరేటూ.. అన్నట్టుగా ఉంటుంది ఉపాసన కొణిదెల ధోరణి.. మొన్నటికి మొన్న ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చోగలరా అంటూ ఒక ఛాలెంజ్ ని విసిరిన ఉపాసన తాజాగా Dare to ware  scrap ?(డేర్ టు వేర్ స్క్రాప్) అంటూ మరో ఛాలెంజ్ విసిరింది.. డిఫెక్టెడ్ కండోమ్స్ తో తయారు చేసిన స్కర్ట్ ని ధరించి మరోమారు నెటిజన్ల దృష్టిని ఆకర్శించింది ఉపాసన ..

Video Advertisement

 

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు సాక్స్ వేస్టేజ్,అట్టపెట్టెలు, చెత్తపేపర్లు చివరికి కాండోమ్స్ కూడా కావేవి బట్టల తయారికి అనర్హం అని అంటున్నారు క్యాన్సల్డ్ ప్లాన్స్ క్లబ్ సభ్యులు.. స్క్రాప్ పేరిట మనం ఎంతో చెత్తని బయట పారేస్తుంటాం..కాని కొందరు ఆ స్క్రాప్ ని కూడా ఏ విధంగా వాడాలి అని తమ మెదడుకి పని పెట్టి రీ యూజ్ చేస్తుంటారు..అందులో భాగంగా తయారు చేసినదే ఈ డిఫెక్టెడ్ కండోమ్స్ స్కర్ట్.

కాండోమ్స్ అనే పదాన్ని వాడడానికే ఆలోచిస్తుంటారు చాలామంది.. అటువంటిది వాటితో తయారు చేసిన డ్రెస్ వేసుకుని ఫోటో దిగి మరీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది ఉపాసన కొణిదెల . దీంతో నెటిజన్లందరూ  ఉపాసనని ప్రశంసల్లో ముంచెత్తుతుతన్నారు. #cancelledplans club  వాళ్లు తయారు చేసిన ఈ డిఫెక్టెడ్ కండోమ్స్  స్కర్ట్ మొదట లోకల్ టెక్స్టెటైల్ షాప్స్ రిజెక్ట్ చేసిన ప్రొడక్ట్.. అయినప్పటికి వారు నిరాశ చెందలేదు..తమ పనులు మానలేదు..ఇప్పుడు ఉపాసన వీరికి అమాంతం క్రేజ్ తీసుకొచ్చింది అని చెప్పవచ్చు.

ఇండియన్ టాయిలెట్ పొజిషన్ తో ఫోటో పెట్టినా, కరోనా గురించి జాగ్రత్తలు చెప్పినా , తండ్రితో కలిసి ఫామ్ హౌజ్లో తిరుగుతూ పేడ చేత పట్టుకున్న, ఇప్పుడు కండోమ్స్ డ్రెస్ వేసినా.. ఉపాసన ఏది చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తను చేసే పనులతో రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతూ, అభిమానులను సొంతం చేసుకుంటుంది..మరి ప్రస్తుతం ఉపాసన విసిరిన ఛాలెంజ్ ని ఎంతమంది స్వీకరిస్తారో చూడాలి..


End of Article

You may also like