Ads
సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు.
Video Advertisement
అయితే, కొంత మంది డైరెక్టర్లు లేదా సెలబ్రిటీలు కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఏదో సరదాకి, లేదా ఆ టైం లో అందుబాటులో ఉండడంతో ఆ పాత్ర చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
అలా ఒక ప్రముఖ యంగ్ సింగర్ కూడా ఒక సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ముకుంద. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రకాష్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేష్, సత్యదేవ్, అభిమన్యు సింగ్, నాజర్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఒక అతిథి పాత్రలో కనిపిస్తారు. అయితే ఒక సీన్ లో విలన్ అయిన అభిమన్యు సింగ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు.
ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ సింగర్ హారిక నారాయణ్. హారిక ఇటీవల కాలంలో విడుదలైన ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్ పాటలు పాడారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో కూడా లాహే లాహే పాట పాడారు హారిక. అలాగే ఆచార్య మాత్రమే కాకుండా, సర్కారు వారి పాట సినిమాలో కూడా మనకి టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతో పాటు వచ్చే సాంగ్ పాడారు హారిక. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో హిట్ సినిమాల్లో హారిక పాటలు పాడారు. అలాగే సరిగమప ప్రోగ్రాంలో మెంటర్ గా కూడా వ్యవహరించారు.
End of Article