‘పొన్నియిన్ సెల్వన్-2 ‘ సినిమాపై లేటెస్ట్ అప్డేట్… ఇలా ప్లాన్ చేసారా..?

‘పొన్నియిన్ సెల్వన్-2 ‘ సినిమాపై లేటెస్ట్ అప్డేట్… ఇలా ప్లాన్ చేసారా..?

by Anudeep

Ads

తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని మణిరత్నం గతం లో ఎన్నో సార్లు వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదిన పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు.

Video Advertisement

పొన్నియన్ సెల్వన్ 1 సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మిగితా చోట్ల మాత్రం దుమ్ము లేపింది. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. కాగా పొన్నియన్‌ సెల్వన్‌ రెండు పార్టులుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండో పార్టుకు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

update on ponniyan selvan 2
పార్ట్ 1 ఎండింగ్ లో పార్ట్ 2 కి ఇచ్చిన లీడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొన్నియన్‌ సెల్వన్‌ -2 చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

update on ponniyan selvan 2
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ సినిమాకు కు సంబంధించిన పాటలు, ప్రొమోలు విడుదల ప్రారంభిస్తారని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా మెజార్టీ భాగం పూర్తయినట్లు సమాచారం.


End of Article

You may also like