Ads
కన్నడ పరిశ్రమ ప్యాన్ ఇండియా స్థాయిలో దుమ్ము లేపుతోంది. కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాల రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆకట్టుకొంటున్న కన్నడ సినీ పరిశ్రమ మరో ప్యాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సెన్సేషనల్ స్టార్ ఉపేంద్ర నటించిన కబ్జ చిత్రం రిలీజ్‌కు ముస్తాబవుతోంది. ఆర్ చంద్రూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పుంజుకొంటున్నాయి.
Video Advertisement
ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులు 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది. ఉపేంద్ర తనదైన మార్క్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కె.జి.యఫ్ తరహాలో రా అండ్ రస్టిక్ రోల్లో ఉపేంద్ర కనిపించబోతున్నారు.
కబ్జ రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదైంది. ఈ సినిమా హిందీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడం మరో రికార్డుగా మారింది. మరో వైపు ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ హీరో నితిన్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. ఇంతకుముందు విడుదలైన కబ్జా సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుదీప్, శ్రీయ సరన్, కబీర్ సింగ్, నవాబ్ షా, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
1947 నుంచి 1984 కాలంలో నడిచే కథే కబ్జా. స్వాతంత్య్ర సమర యోధుడు కొడుకు మాఫియా వరల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. తర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి వైరల్ గా మారింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు కబ్జ మూవీ రివ్యూ చెప్పేసారు.
” కబ్జ మూవీ ఫైనల్ కట్ ఎడిటింగ్ పూర్తి అయ్యింది. ఇన్సైడ్ రిపోర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు. ఇక మరో వైపు హిందీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోవడంతో తెలుగు, తమిళ, మలయాళ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.
End of Article