ఉప్పెన సినిమాలోని “నీ కన్ను నీలి సముద్రం” పాటని… సీన్-టు-సీన్ కాపీ కొట్టేసారుగా..? ఏ సినిమా నుండి అంటే..?

ఉప్పెన సినిమాలోని “నీ కన్ను నీలి సముద్రం” పాటని… సీన్-టు-సీన్ కాపీ కొట్టేసారుగా..? ఏ సినిమా నుండి అంటే..?

by Anudeep

Ads

మన మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మరియు అందాల భామ కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం ఉప్పెన. హీరో హీరోయిన్ ఇద్దరూ ఇదే తొలి చిత్రం. రొమాంటిక్ డ్రామాగా జనవరి 12 2021 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులందరికి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. కరోనా అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

Video Advertisement

విజయ్ సేతుపతి, గాయత్రీ జయరాం, రాజీవ్ కనకాల, మహదేవన్, బ్రహ్మాజీ, సాయి చంద్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు. ఉప్పెన చిత్రానికి గాను బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ సారథ్యం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. దర్శకుడే ఈ చిత్రానికి రచయిత కావడం విశేషం.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే కొన్ని సీన్లు ఆ చిత్రం నుంచి ఉప్పెన చిత్రంలోకి కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనవారు కాపీ కొట్టిన హిందీ చిత్రం ఏంటో చూద్దాం.. 2013 జూన్ 21న హిందీలో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా కథాంశంగా గా రూపొందిన రంజనా. చిత్రానికిగాను ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  ధనుష్ మరియు సోనం కపూర్ కలసి నటించారు. ఇప్పుడు మన వాళ్ళు ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను అచ్చుగుద్దినట్టు దింపేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో చెక్కర్లు కొడుతుంది.

అంతే కాకుండా రెండు పాటలు పాడిన సింగర్ కూడా ఒకరే. కొన్ని సీన్స్ మాత్రం రెండు పాటల్లో దాదాపు ఒకే లాగా ఉన్నాయి. ఆ సన్నివేశాలు ఏంటంటే.. చిన్నతనంలో హీరో హీరోయిన్ మొదటిసారిగా చూసుకునే సన్నివేశం, మరియు బేబమ్మ  ఫంక్షన్ లో  డాన్స్ వేసే సన్నివేశం, అదేవిధంగా స్కూల్లో చదువుకునేటప్పుడు సన్నివేశాలు కాపీ చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CfI9zITDy2p/?igshid=YmMyMTA2M2Y


End of Article

You may also like