Ads
ఉర్ఫి జావేద్ చిత్ర విచిత్రమైన ఫోటో షూట్ లతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సందడి చేస్తుందన్న సంగతి తెలిసిందే. నిత్యం రకరకాల ఫొటోస్ పెట్టి తన ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. దానికి తోడు ఆమె బయటకి వచ్చిందంటే చాలు మీడియా వాళ్ళు కూడా చాలా హడావిడి చేస్తూ ఉంటారు.
Video Advertisement
ఒక్కోసారి విచిత్రమైన వస్త్రధారణతో ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తూ ఉంటుంది ఉర్ఫి. తాజాగా.. అలాంటి పని చేసి నెటిజన్స్ ట్రోలింగ్ కి గురి అయ్యింది. ఆమె వేసుకున్న డ్రెస్ విచిత్రంగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫోటో క్యూబ్ అనే డ్రెస్ ను వేసుకుని ట్రోలర్స్ కంట్లో పడింది. తన ఫోటోలను ప్రింట్ చేయించుకుని డ్రెస్ లా డిజైన్ చేయించుకుని వేసుకుంది. ఒక వీడియో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఈ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ చూసి ఆమె ఫ్యాన్స్ సైతం షాక్ కి గురి అయ్యారు. ఇక ట్రోలర్స్ సంగతి సరే సరి. ఈ డ్రెస్ ఏంటి తల్లీ.. అంటూ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేసేస్తున్నారు.
బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొని కొంత పాపులారిటీ తెచ్చుకున్న ఉర్ఫి జావేద్.. ఆ పాపులారిటీని మరింత పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటో క్యూబ్ డ్రెస్ పోస్ట్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అయితే ఆమె మాత్రం విమర్శలు వచ్చినా, పొగడ్తలు వచ్చినా పట్టించుకోనని అంటోంది. ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ.. ” ఈ స్టయిల్ ను ఇంటర్నెట్ లో చూసాను.. దీనిని రీ క్రియేట్ చేయాలనీ అనుకున్నా.. నేను ట్రై చేసినది మీతో పంచుకుంటున్నా.. మీరంతా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా..” అంటూ కాప్షన్ ను కూడా జత చేసింది.
Watch Video:
https://www.instagram.com/reel/CbrPS94o-B7/?utm_source=ig_embed&ig_rid=20f79f98-a72c-49c6-9fbb-d0a4c090239a
End of Article