Ads
వాల్తేరు వీరయ్యలో చిత్రంలో ‘వేర్ ఈజ్ ది పార్టీ’ పాటలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసిన బాలీవుడ్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. తన డాన్స్ తో లుక్స్ తో యూత్ ని ఆకర్షించిన బ్యూటీ ఊర్వశీ రౌతేలా.
Video Advertisement
ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తాజాగా అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ చిత్రంలో ‘వైల్డ్ సాల’ అనే స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడింది. తాజాగా ఊర్వశీ రౌతేలా ప్రత్యేక పాటలో నటించడానికి తీసుకునే పారితోషికం వైరల్ గా మారింది. మరి ఆమె ఒక సాంగ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ లోని పాపులర్ హీరోయిన్స్ లలో ఊర్వశి రౌతేల ఒకరు. ఆమె హీరోయిన్గా నటించడమే కాకుండా ప్రత్యేక సాంగ్స్ లో నర్తించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశీ తన గ్లామరస్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంది. అలాగే ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా దక్షణాది మూవీ మేకర్స్ కూడా ఊర్వశీని తమ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె హసీనో కా దీవానాలో సాంగ్ లో చేసిన డ్యాన్స్ అమితాబ్ బచ్చన్ నుండి ప్రశంసలు అందుకుంది.
అప్పటి నుండి ఆమెను పలువురు బాలీవుడ్ మరియు సౌత్ మేకర్స్ ఊర్వశిని తమ చిత్రాల్లో ఆమెతో డ్యాన్స్ చేయించాలని అనుకుంటున్నారు. అయితే ఆమె ఎంతబాగా డాన్స్ చేస్తుందో, ఆ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. గతంలో సీటీ మార్ మూవీ నిర్మాత తమ మూవీ కోసం ఒక సాంగ్ లో డ్యాన్స్ చేయమని ఊర్వశిని ఆడగగా అందుకు ఆమె కోటి డిమాండ్ చేసిందంట. దీంతో ఆ ప్రొడ్యూసర్ తన ఆలోచనను విరమించుకున్నాడట.
లెజెండ్ మూవీ కోసం 20 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. బాస్ పార్టీ సాంగ్ కి ఊర్వశి రౌతేల 2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ‘ఏజెంట్’ మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిశారు. ‘వైల్డ్ సాలా’ పాటతో యువతను ఉర్రూతలూగించారు. ఇందులో ఆమె ధరిచిన డ్రెస్ కోసం 20 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. డ్రెస్ కే అంత ఖర్చు అయితే ఆమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవచ్చని టాక్ వినిపిస్తోంది.
End of Article