Ads
ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. తెలుగు చిత్రాలలో ఇప్పటికే 3 స్పెషల్ సాంగ్స్ చేసింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ మూవీలో కూడా ఒక ఐటెం సాంగ్ చేసింది.
Video Advertisement
అయితే ఈ పాట హిట్ అవుతుందో లేదో కానీ, ఊర్వశి రౌతేలా చేసిన ఒక ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆ ట్వీట్ కి నెటిజెన్లు ఊర్వశిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇన్నాళ్లూ ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు ఒక ట్వీట్‌తో అనే కంటే ట్వీట్‌లోని రాసిన పదంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు ఆ ట్వీట్ కి సంతోషంతో కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
ట్రోల్ చేసేంతగా ఆ ట్వీట్ లో ఏముంది అంటే “మా చిత్రం #BroTheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం @పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్‌ను చేసుకోవడం సంతోషంగా ఉంది. మరణించిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.’’ అని ఊర్వశి రౌతేలా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని అనడంతో నెటిజన్లు, ప్రత్యర్ధి పార్టీల ఫ్యాన్స్ మాత్రం ఊర్వశిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆనందపడుతున్నారు. ఊర్వశి రౌతేలా ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాంటి కామెంట్స్ చేశారు. తమిళ మూవీ ‘ది లెజెండ్’ మూవీ ప్రమోషన్స్ లో అరుళ్ శరవణన్ ను పదేళ్ల తరువాత తమిళనాడు చీఫ్ మినిస్టర్ అవుతారని ఊర్వశి రౌతేలా అన్నారు. ఇప్పుడు ఆ వీడియో క్లిపింగ్ ను, ఈ ట్వీట్ కింద కామెంట్స్ లో షేర్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు.
I have seen this before👀 https://t.co/iNk5RmXJiR pic.twitter.com/lr3yx8lt5G
— PrayushKhanna🤴 (@prayushkhanna12) July 27, 2023
Also Read: BRO REVIEW : “పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article