Bro Review : “పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Bro Review : “పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ఏడాదికి ఒక సినిమా చొప్పున వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో మరొక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : బ్రో
  • నటీనటులు : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, ప్రియా ప్రకాష్ వారియర్.
  • నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్, జీ స్టూడియోస్.
  • దర్శకత్వం : సముద్రఖని
  • సంగీతం : తమన్ ఎస్
  • విడుదల తేదీ : జూలై 28, 2023

bro movie review

స్టోరీ :

కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) అనే ఒక కార్పొరేట్ ఉద్యోగి చుట్టూ నడుస్తుంది. తండ్రి తర్వాత ఇంటికి పెద్ద దిక్కు తనే అవ్వడంతో తన సోదరుడు, చెల్లెలు, తల్లి బాధ్యతలు మార్క్ చూసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటిలో పడి తన గురించి తాను ఆలోచించుకోవడం మర్చిపోతాడు.

bro movie review

అలాంటి ఒక సమయంలో మార్క్ కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు దేవుడు (పవన్ కళ్యాణ్) మార్క్ కి కనిపిస్తాడు. తర్వాత మార్క్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మార్క్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? తన సమస్యలను పరిష్కరించుకున్నాడా? పరిస్థితులను ఎలా సరి చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలు అనేది సహజమైన విషయం అయిపోయింది. మన సినిమాలు వేరే భాషల్లో, వేరే భాషల సినిమాలు మన ఇండస్ట్రీలో రీమేక్ అవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మూడవ రీమేక్ సినిమా ఇది. అయితే రీమేక్ సినిమా అయినా కూడా వీటన్నిటిని మన నేటివిటీకి తగ్గట్టుగా మారుస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా అలాగే మార్చారు. తమిళ్ లో వినోదయ సిత్తం పేరుతో రూపొందింది ఈ సినిమా.

bro movie review

అందులో తంబి రామయ్య ఒక బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపిస్తారు. ఆయన ఒక మధ్య వయస్కుడు. కానీ తెలుగులో ఆ పాత్రని సాయి ధరమ్ తేజ్ పాత్రగా చేశారు. ఇంక పవన్ కళ్యాణ్ పాత్ర విషయానికి వస్తే సినిమా మొదటి నుండి చివరి వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నంత సేపు కూడా పాత సినిమాల రిఫరెన్స్ లని గుర్తు చేస్తూ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇది అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తారు.

bro movie review

అంతే కాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలింగ్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అది సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా నడుస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో, సెకండ్ హాఫ్ అంతే బలహీనంగా అనిపిస్తుంది. రీమేక్ కోసం చేసిన మార్పులు కొన్ని వర్కౌట్ అయినా కూడా కొన్ని అవ్వలేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్స్, రచన అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సినిమాలో మాత్రం ఎక్కడో అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది.

bro movie review

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యారు. సినిమా మొదటి నుండి చివరి వరకు చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. ఇలాంటి పాత్ర గోపాల గోపాల సినిమాలో పోషించినా కూడా ఈ సినిమాలో ఇంకా కొంచెం చలాకీగా చేశారు. సాయి ధరమ్ తేజ్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. కానీ చాలా చోట్ల తడబడుతున్నట్టు అలాగే పాటల్లో అయితే స్టెప్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కొంచెం శ్రమ పడినట్టు కనిపిస్తుంది. కానీ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

bro movie review

రోహిణి పాత్ర బాగున్నా కూడా ఇంకా ఆస్కారం ఉంటే బాగుండేది. ఇంక హీరోయిన్ కేతిక శర్మ అయితే పాటకి ముందు వచ్చి పాట తర్వాత వెళ్ళిపోతుంది అంతే. మరొక హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఏదో అప్పుడప్పుడు అలా కనిపిస్తుంది. వారిద్దరికీ పెద్ద చెప్పుకోదగ్గ పాత్రలు ఏమీ లేవు. వెన్నెల కిషోర్ కూడా తన పాత్ర పరిధి మేరకు చేశారు. తమన్ అందించిన పాటలు విడుదల అయినప్పుడు ఎలాంటి కామెంట్స్ వచ్చాయో చూస్తున్నప్పుడు కూడా అలాంటి కామెంట్స్ వస్తాయి.

bro movie review

అసలు ఒక పెద్ద హీరో సినిమాకి ఉండాల్సిన పాటలు ఇవేనా అని ఒక సమయంలో అనిపిస్తుంది. బ్రో అని వచ్చే ఒక పాట తప్ప మిగిలిన రెండు పాటలు కూడా అంత చెప్పుకునే తగ్గట్టుగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టు ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ రాయడంలో పెట్టిన శ్రమ సెకండ్ హాఫ్ రాయడంలో పెట్టలేదు ఏమో అనిపిస్తుంది. అలా నడుస్తూ వెళ్ళిపోతుంది అంతే. అసలు ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ కూడా అవ్వవు.

bro movie review

తెరపై హీరో ఏడుస్తూ తన తల్లితో మాట్లాడే సీన్స్ ఇలాంటివి కూడా ఏదో సినిమా ఎండింగ్ కి వచ్చేసింది, ఇంక హీరో సమస్యలు అన్ని పరిష్కరించేసేయాలి అని పెట్టినట్టు ఉంటాయే తప్ప అవి సహజంగా వచ్చినట్టు అనిపించవు. ప్రేక్షకులకి ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ అవ్వవు. ఇదంతా ఒక స్టార్ హీరో సినిమా కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా తీసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఇంకొక లెవెల్ లో ఉండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • పవన్ కళ్యాణ్
  • స్టైలింగ్
  • ఫస్ట్ హాఫ్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
  • కొన్ని సీన్స్ రాసిన విధానం
  • పాటలు

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూద్దాం అనుకునే వారికి ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది. కమర్షియల్ మెసేజ్ సినిమాలు అనే ఫార్మాట్ మనకి కొత్త ఏమీ కాదు. అలాంటి ఫార్మాట్ లో వచ్చిన ఒక సినిమాగా బ్రో సినిమా నిలుస్తుంది.

watch trailer : 

ALSO READ : నాని “వి” నుండి… విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” వరకు… “కాన్సెప్ట్” బాగున్నా కూడా “ఫ్లాప్” అయిన 10 సినిమాలు..!


End of Article

You may also like