నాని “వి” నుండి… విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” వరకు… “కాన్సెప్ట్” బాగున్నా కూడా “ఫ్లాప్” అయిన 10 సినిమాలు..!

నాని “వి” నుండి… విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” వరకు… “కాన్సెప్ట్” బాగున్నా కూడా “ఫ్లాప్” అయిన 10 సినిమాలు..!

by kavitha

Ads

తెలుగులో ప్రతి శుక్రవారం అనేక చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి హిట్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, కాన్సెప్ట్ బాగున్నా, స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అవుతుంటాయి.

Video Advertisement

అలా టాలీవుడ్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు అంతగా ఆడలేదు. మరి మంచి కాన్సెప్ట్ తో వచ్చి, ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..1. స్పైడర్:

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు మురగ దాస్ తెరకెక్కించిన సినిమా స్పైడర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. మంచి కాన్సెప్ట్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది. 2. డియర్ కామ్రేడ్:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రెండవ డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. గీతగోవిందం జంట నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019 లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది. 3. నాని వి:

హీరోలు నాని, సుధీర్ బాబు నటించిన క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా,  దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించాడు. ఈ మూవీలో అదితి రావు హైదరీ, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా నటించారు.
4. అమిగోస్:

నందమూరి కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్’. కొత్త కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తో ప్లాప్ గా నిలిచింది. 5. డిస్కో రాజా:

‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా  ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా  ‘డిస్కో రాజా’. రవితేజ స్టైలిష్ లుక్‌‌లో కనిపించడం,టీజర్, ట్రైలర్ కొత్తగా ఉండటంతో ఈ చిత్రం పై ఆడియెన్స్ అంచనాలు పెరిగాయి. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. 6. సవ్యసాచి:

హీరో నాగ చైతన్య, మాధవన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా సవ్యసాచి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి  చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భూమిక చావ్లా, నిధి అగర్వాల్‌ నటించారు. 7. నా పేరు సూర్య:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన సినిమా నా పేరు సూర్య. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించారు. టీజర్ తోనే ఈ మూవీ భీభత్సమైన ఇంపాక్ట్ ఏర్పడింది. కానీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.
8. ఎంత మంచివాడవురా:

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించిన మూవీ ఎంత మంచివాడవురా. ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించింది.9. అంతరిక్షం:

వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ మూవీ డైరెక్టర్ సంకల్ప్  రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం అంతరిక్షం. ఈ మూవీ ప్రకటించే సమయానికి ఇండియాలో స్పేస్ కాన్సెప్ట్ లో వచ్చిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి,  అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు.
10. ఆరెంజ్: 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంట నటించిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయినప్పటికీ,ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.

Also Read: ఇక కోలీవుడ్ లో అంతా లోకల్ స్టార్స్….వైరల్ అవుతున్న ఫెఫ్సీ నిబంధనలు..!

 


End of Article

You may also like