యదార్థ సంఘటనతో తీసిన ఈ సినిమా గురించి తెలుసా..? ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా..?

యదార్థ సంఘటనతో తీసిన ఈ సినిమా గురించి తెలుసా..? ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా..?

by kavitha

Ads

దుల్కర్ సల్మాన్ సీతా రామం మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుని, చాలా మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీతో దుల్కర్ తెలుగు హీరోగా మారడమే కాకుండా చాలా మంది తెలుగు ఆడియెన్స్ కు అభిమాన హీరో అయ్యారు. ఈ మూవీతో సంచలన విజయం సాధించిన దుల్కర్ ఆ తరువాత డిఫెరెంట్ కథతో ‘చుప్’ అనే బాలీవుడ్ మూవీలో  నటించారు.

Video Advertisement

ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ ఆర్ భల్కి దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్, శ్రేయా దంవర్తీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత ఏడాది ధియేటర్లలో రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. దుల్కర్ సల్మాన్ సీతా రామం వంటి ప్రేమ కథ తరువాత థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ‘చుప్’ మూవీ ద్వారా ఆడియెన్స్ ను పలకరించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ముంబైలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. హిందీ చిత్రాలకు తక్కువ రేటింగ్ ఇస్తూ రివ్యూలు రాసే క్రిటిక్స్‌ను లక్ష్యం చేసుకుని, వారు రివ్యూను ఏ స్టైల్‌లో రాశారో, ఒక సీరియల్ కిల్లర్ అదే స్టైల్‌లో వారిని హత్య చేస్తుంటాడు.chup-movieదాంతో క్రిటిక్స్ ఆ సీరియల్ కిల్లర్ ను చంపేవరకు రివ్యూలు రాయమని అని చెప్పడంతో, కిల్లర్ ను పట్టుకోవడానికి పోలిస్ ఆఫీసర్ సన్నీ డియోల్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?  సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అనేది మిగిలిన కథ. సినిమాలకు రివ్యూలు రాసే క్రిటిక్స్ ను చంపడం, వాళ్ళ నుదుటి పై స్టార్స్ రేటింగ్ వేసే కిల్లర్ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఆర్ బాల్కీ కథ ఐడియా విషయంలో తన ప్రత్యేకత చాటుకున్నారు. అయితే దానిని  మూవీ మొత్తం చూపించలేకపోయారు.సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకుంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత హంతకుడు ఎవరు అనే విషయం తెలిసిన తరువాత కథనం స్లోగా సాగుతుంది. సగటు థ్రిల్లర్ చిత్రాల తరహాలోనే ఈ మూవీ సాగింది. తిరిగి క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ ఈ మూవీలో మరోసారి అద్భుతమైన నటనతో పాత్రకు జీవం పోశారు. దుల్కర్ లేకపోతే మూవీ నిలబడేది కాదు. దుల్కర్ క్యారెక్టర్ లో మరొకరిని ఊహించలేము. శ్రేయా ధన్వంతరి, సన్నీ డియోల్ చక్కగా నటించారు. అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ లో ఒక్క సీన్ లో కనిపించారు. దుల్కర్ నటన కోసం చూడాల్సిన మూవీ ఇది.

Also Read: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?


End of Article

You may also like