ఎట్టకేలకి OTT లోకి వచ్చిన సూపర్ హిట్ సినిమా..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?

ఎట్టకేలకి OTT లోకి వచ్చిన సూపర్ హిట్ సినిమా..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?

by Mohana Priya

Ads

భారతదేశం అంతటా ఉన్న అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో ఉన్న గొప్ప నటుల్లో ఫహద్ ఫాసిల్ కూడా ఒకరు. ఇటీవల పుష్ప సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన ఆవేశం సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యి చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ నిర్మించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అజు (హిప్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శంతన్‌ (రోషన్ షానవాజ్) ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు.

Video Advertisement

this hero took a break then scored hit

చదువు కోసం కేరళ నుండి బెంగళూరుకు వెళ్తారు. కాలేజ్ హాస్టల్ కంటే బయట ఉండే హాస్టల్ లో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది అని ఒక హాస్టల్ లో చేరుతారు. తమ కాలేజ్ సీనియర్ అయిన కుట్టితో వారికి గొడవ జరుగుతుంది. దాంతో కుట్టి మనుషులు వీళ్ళ ముగ్గురిని కొడతారు. కోపంతో అజు వాళ్లకి ఎలాగైనా పాఠం చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఒక బార్ లో వీళ్ళకి మలయాళీ – కన్నడ రౌడీ అయిన రంగా (ఫహద్ ఫాసిల్) కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. రంగా వీళ్ళ ముగ్గురికి సహాయం చేయడంతోనే సినిమా ఆగిపోదు. ఆ తర్వాత రంగా వీళ్ళ ముగ్గురితో స్నేహం కూడా చేస్తాడు.

అప్పుడు జరిగే పరిస్థితులన్నిటినీ కూడా ఈ సినిమాలో చూపించారు. సినిమాకి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే సినిమా కంటెంట్ అంత బలంగా ఉంది అని అర్థం. రంగా అనే పాత్రలో ఫహద్ ఫాసిల్ నటన ఆయన ఎంత గొప్ప నటుడు అనేది మరొకసారి చూపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు రంగా అనే ఒక వ్యక్తి మాత్రమే కనిపిస్తాడు. అసలు అతను రౌడీ అవ్వడానికి కారణం ఏంటి, అంత పెద్ద మనిషి అయిన రంగా ఒంటరితనాన్ని అనుభవించే విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు.

జీతూ మాధవన్ గతంలో రోమాంచం సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆవేశం సినిమా కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ తెలుగు వాళ్ళు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఈ గొప్ప సినిమాని పొగుడుతూ ఉన్నారు.


End of Article

You may also like